News November 13, 2024
‘గడియారం’పై విచారణ.. సొంతకాళ్లపై నిలబడాలన్న సుప్రీంకోర్టు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫొటోలు, వీడియోలు వాడరాదని అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కార్యకర్తలకు ఈ విషయం తెలియజేయాలని పేర్కొంది. సొంతకాళ్లపై నిలబడటం నేర్చుకోవాలని జస్టిస్‌లు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ నేతృత్వంలోని NCP గడియారం గుర్తును వాడకుండా ఆదేశించాలన్న పిటిషన్‌ను కోర్టు విచారించింది. NOV 20 మహారాష్ట్రలో పోలింగ్ డే.
Similar News
News November 4, 2025
సైన్యాన్ని కూడా ఆ 10% మందే నియంత్రిస్తున్నారు: రాహుల్

బిహార్ ఎన్నికల ప్రచారంలో CONG నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. ‘దేశంలోని 10% జనాభాకే (అగ్రవర్ణాలు) కార్పొరేట్ సెక్టార్, బ్యూరోక్రసీ, జుడీషియరీలో అవకాశాలు దక్కుతున్నాయి. చివరకు ఆర్మీ కూడా వారి కంట్రోల్లోనే ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 90% ఉన్న SC, ST, BC, మైనారిటీలు కనిపించరని పేర్కొన్నారు. కాగా భారత సైనికుల్ని చైనా సైన్యం కొడుతోందని ఇదివరకు RG కామెంట్ చేయగా SC మందలించింది.
News November 4, 2025
స్పోర్ట్స్ రౌండప్

✒ మోకాలి గాయంతో బిగ్‌బాష్ లీగ్ సీజన్-15కు అశ్విన్ దూరం
✒ రంజీ ట్రోఫీ: రాజస్థాన్‌పై 156 రన్స్ చేసిన ముంబై బ్యాటర్ యశస్వీ జైస్వాల్
✒ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్: IND-A కెప్టెన్‌గా జితేశ్ శర్మ, జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
✒ ICC ఉమెన్స్ ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నం.1గా లారా వోల్వార్డ్ట్.. రెండో స్థానానికి చేరిన స్మృతి మంధాన
✒ U19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి ఎంపికైన ద్రవిడ్ కుమారుడు అన్వయ్ 
News November 4, 2025
జూబ్లీ గెలుపుపై రోజుకో సర్వే వెనుక రహస్యమేమి?

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రోజుకో సర్వే విడుదలవుతోంది. ఇప్పటి వరకు 3 సర్వే సంస్థల నివేదికలు బయటకు వచ్చాయి. గెలుపుపై 2 బీఆర్ఎస్కు, 1 కాంగ్రెస్‌కు అనుకూలంగా చెప్పాయి. ఇవి వివాదంగా మారగా 2పార్టీలూ అధికారులకు ఫిర్యాదు చేశాయి. అయితే అనుకూలతను పెంచుకొనేందుకు పార్టీలే ఇలా సర్వే సంస్థల ద్వారా కొత్త ప్రచారం మొదలుపెట్టాయని కొందరు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల ప్రభావం తటస్థ ఓటర్లపై పడొచ్చని అంటున్నారు.


