News August 18, 2024
‘పోలవరం’ ఫైల్స్ దగ్ధంపై విచారణ: దుర్గేశ్

AP: ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో పలు ఫైళ్లు <<13878167>>దగ్ధం<<>> కావడంపై మంత్రి కందుల దుర్గేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం ఉందని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దగ్ధమైనవి జిరాక్స్ పత్రాలని ప్రకటించిన రాజమండ్రి RDO శివజ్యోతిపై మంత్రి ఫైరయ్యారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలని JC చెన్నారాయుడిని ఆదేశించారు.
Similar News
News December 4, 2025
PDPL: సమస్యాత్మక బూత్లపై ప్రత్యేక దృష్టి: CP

పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్లో ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు. పోస్టల్ బ్యాలెట్, ప్రవర్తనా నియమావళి అమలు, బ్యాలెట్ పేపర్ల ముద్రణపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో సింగిల్ నామినేషన్లు లేవని VCలో పాల్గొన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సమస్యాత్మక బూత్లపై ప్రత్యేక పర్యవేక్షణ పెడుతున్నట్లు CP అంబర్ కిషోర్ ఝా చెప్పారు.
News December 4, 2025
ఈ అలవాట్లతో సంతోషం, ఆరోగ్యం!

చిన్న చిన్న అలవాట్లే మంచి ఆరోగ్యం, సంతోషానికి కారణమవుతాయని న్యూరాలజిస్ట్ సుధీర్ కుమార్ చెబుతున్నారు. ఉదయాన్నే సూర్యకాంతిలో ఉండటం, రోజువారీ నడక, మంచి నిద్ర, శ్రద్ధతో తినడం, మిమ్మల్ని కేర్ చేసే వారితో మాట్లాడటం, 2 నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్, దయతో వ్యవహరించాలని తెలిపారు. రాత్రి వేళల్లో స్క్రీన్ చూడటం తగ్గించడం, హైడ్రేటేడ్గా ఉండటం, రోజూ కొత్తవి నేర్చుకోవడం అలవాటుగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.
News December 4, 2025
ఇండియాలో పుతిన్ను అరెస్టు చేస్తారా?

ఉక్రెయిన్పై యుద్ధంతో రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ICC) 2023లో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీని ప్రకారం ICCలో సభ్యత్వం ఉన్న 125 దేశాలకు పుతిన్ను అరెస్టు చేసే అధికారం ఉంది. అందుకే పుతిన్ ఆ దేశాలకు వెళ్లరు. వాటి ఎయిర్స్పేస్ కూడా వాడుకోరు. భారత్ ICC సభ్యదేశం కాదు. ఒకవేళ పుతిన్ను అప్పగించాలని ICC కోరినా భారత్.. రష్యాతో స్నేహం వల్ల అందుకు తిరస్కరించే అవకాశమే ఎక్కువ.


