News September 20, 2024
దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిపై విచారణ

TG: హైదరాబాద్లోని దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఎఫ్టీఎల్ పరిధి 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతమ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గత రికార్డుల్లో అది 65 ఎకరాలుగా ఉందని పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Similar News
News November 22, 2025
PHOTO GALLERY: గరుడ వాహనంపై తిరుచానూరు అమ్మవారు

AP: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. దీనిని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీవారికి గరుడ సేవ ప్రీతిపాత్రమైనదిగా పండితులు చెబుతారు. తిరుచానూరులో ఆ సేవ జరిగే టైంలో శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి బంగారు పాదాలను పంపుతారని ప్రతీతి.
News November 22, 2025
దేవుడు పిలుస్తున్నాడంటూ.. కుటుంబం ఆత్మహత్య

HYD అంబర్పేట్కు చెందిన శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులు వారి కూతురు శ్రావ్యతో పాటు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిరోజుల కిందట వారి పెద్ద కూతురు కూడా సూసైడ్ చేసుకుంది. తర్వాత ఈ ఫ్యామిలీ రాంనగర్ నుంచి అంబర్పేట్కు మారింది. తమనీ దేవుడు పిలుస్తున్నాడని, పెద్ద కూతురి దగ్గరికే వెళ్తామని చుట్టుపక్కల వాళ్లతో చెప్పినట్లు సమాచారం. దీంతో మూఢనమ్మకాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
News November 22, 2025
పరకామణి కేసు.. శ్రీనివాసులుకు భద్రత కల్పించండి: హైకోర్టు

AP: పరకామణి <<18290953>>కేసులో<<>> పిటిషనర్ శ్రీనివాసులుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ దర్యాప్తు కోరుతూ శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని తిరుపతి జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ కేసులో ఫిర్యాదుదారు సతీశ్ అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే.


