News November 19, 2024

‘కాళేశ్వరం’పై విచారణ.. ఈనెలాఖరున KCRకు పిలుపు!

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ పీసీ ఘోష్ ఎల్లుండి HYD రానున్నారు. తొలుత ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనిచేసిన అధికారులు ఎస్కే జోషి, సోమేశ్‌కుమార్, రజత్‌కుమార్, స్మితా సబర్వాల్‌, రామకృష్ణారావును క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఆ తర్వాత ఈనెలాఖరున లేదా DEC తొలివారంలో KCR, హరీశ్ రావును విచారణకు పిలవనున్నట్లు సమాచారం. అయితే KCR విచారణకు వెళ్తారా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.

Similar News

News November 19, 2024

ధనుష్-నయన్ వివాదం.. రాధిక కీలక వ్యాఖ్యలు

image

ధనుష్-నయనతార వివాదం నేపథ్యంలో రాధికా శరత్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నానుమ్ రౌడీ దాన్’ మూవీలో ఆమె విజయ్ తల్లిగా నటించారు. ‘షూటింగ్ సమయంలో ధనుష్ కాల్ చేసి ‘‘అక్కా.. నీకు సిగ్గులేదా?’’ అని అనడంతో షాక్ అయ్యా. ఏమైందని అడిగా. ‘‘విఘ్నేశ్-నయన్ డేటింగ్‌లో ఉన్నట్లు నీకు తెలియదా?’’ అని అడిగాడు. నాకు నువ్వు చెప్పేవరకు తెలియదని చెప్పా’ అని డాక్యుమెంటరీలో రాధిక చెప్పిన వీడియో వైరలైంది.

News November 19, 2024

BGT కోసం భారత క్రికెటర్ల ప్రాక్టీస్

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా క్రికెటర్లు సన్నద్ధమవుతున్నారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జైస్వాల్, రిషభ్ పంత్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. ఆయన హోటల్ రూమ్‌లోనే ఉండిపోయారు. కాగా ఈ నెల 22 నుంచి INDvsAUS మధ్య పెర్త్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.

News November 19, 2024

‘అన్నదాత సుఖీభవ’కు బడ్జెట్ కేటాయించాం: అచ్చెన్నాయుడు

image

AP: త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులను రైతులకు ఇస్తామని, ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్‌లో రూ.4,500 కోట్లు కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మండలిలో YCP సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘ఏటా రైతులందరికీ రూ.20 వేలు అందజేస్తాం. ఇందులో PM కిసాన్ రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి ఇస్తాం. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.