News October 6, 2025
నేవీ అమ్ములపొదిలోకి ‘ఐఎన్ఎస్ ఆండ్రోత్’

ఇండియన్ నేవీలో ఇవాళ మరో యుద్ధ నౌక చేరనుంది. శత్రు దేశాల సబ్‌మెరైన్ల ఉనికిని పసిగట్టేందుకు విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో ‘ఐఎన్ఎస్ ఆండ్రోత్’ జలప్రవేశం చేయనుంది. నేవీకి ఇది రెండో యాంటీ సబ్‌మెరైన్ వాటర్‌ఫేర్ షాలోవాటర్ క్రాఫ్ట్. అత్యాధునిక తేలికపాటి టార్పెడోలు, సబ్‌మెరైన్ల విధ్వంసక రాకెట్లతో దాడి చేయగలదు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఈ నౌక తయారీకి 80% స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించారు.
Similar News
News October 6, 2025
బిహార్ అసెంబ్లీ ముఖచిత్రం చూస్తే..

UP, బెంగాల్, మహారాష్ట్ర తర్వాత నాలుగో అత్యధిక అసెంబ్లీ స్థానాలు(243)న్న బిహార్‌కు ఇవాళ సాయంత్రం గం.4కు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 2020 ఎన్నికల్లో NDA 125, INDIA 110, ఇతరులు 8 స్థానాలు పొందాయి. ఓటుబ్యాంకు: NDA 37.26%, INDIA 37.23%. 20% స్థానాల్లో గెలుపు-ఓటముల తేడా 2.5%లోపే. NDA ఇలా 21, INDIA 22 సీట్లు పొందాయి. రెండు కూటముల మధ్య పోటీతో వేవ్ స్వింగ్ అయ్యే ఈ సీట్లే అధికారాన్ని నిర్ణయిస్తాయి.
News October 6, 2025
టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్.. ఫ్రీగా పంపిస్తున్నారా?

సొంతూళ్లకు వెళ్లి మహానగరానికి తరలివస్తోన్న వారితో HYD శివారు హైవేలపై భారీగా <<17927176>>ట్రాఫిక్ జామ్<<>> అవుతోంది. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర క్యూ ఉంటోంది. అలాంటి సమయంలో వాహనాలను టోల్ లేకుండా పంపాలని NHAI నిబంధనల్లో ఉంది. క్యూ లైన్ 100మీటర్ల పసుపు గీతను దాటినా.. సాంకేతిక సమస్యలతో వాహనం 10 సెకన్ల కంటే ఎక్కువ వేచి ఉన్నా ఉచితంగా వెళ్లొచ్చు. ఇవి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉద్దేశించినవి.
News October 6, 2025
VITMలో 12పోస్టులు.. దరఖాస్తు చేశారా?

విశ్వేశ్వరయ్య ఇండస్ట్రీయల్& టెక్నలాజికల్ మ్యూజియం(VITM) 12 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 20వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నిషియన్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ITI, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.885. మహిళలు, SC, ST, PwDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://www.vismuseum.gov.in/