News August 24, 2024

ఒక టిక్‌టాక్ వీడియోతో ఐస్‌లాండ్‌లో కీరదోస కొరత

image

సమాజాన్ని సోషల్ మీడియా ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చేప్పే ఘటన ఇది. కీరదోస సలాడ్‌ షేక్‌ ఎలా చేసుకోవాలో చెబుతూ లోగాన్ మోఫిట్ అనే టిక్‌టాకర్ చేసిన పోస్ట్ ఐస్‌లాండ్‌లో వైరల్ అయింది. ఆ షేక్‌ను అక్కడి ప్రజలు వేలంవెర్రిగా ఇంట్లో చేసేందుకు యత్నించడంతో కీర దోసలన్నీ ఖాళీ అయిపోయి కొరత ఏర్పడిందని రిటెయిల్ అమ్మకాల సంస్థ క్రోనాన్ ప్రకటించింది.

Similar News

News April 3, 2026

రాజధానిపై వైసీపీకి క్లారిటీ లేదా?

image

AP: రాజధానిపై YS జగన్, ఆ పార్టీ ముఖ్య నేతల స్టేట్‌మెంట్లు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ‘మావిగన్’ను రాజధాని చేయాలని జగన్ అంటుంటే.. తాము అమరావతికి వ్యతిరేకం కాదని వైవీ సుబ్బారెడ్డి సహా ఇతర ఎంపీలు చెబుతున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయలేదని, అందుకే బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో రాజధానిపై వైసీపీకి క్లారిటీ ఉందా? లేదా? అన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

News April 3, 2026

ఐశ్వర్యరాయ్‌తో విడాకుల పుకార్లు.. అభిషేక్ ఏమన్నారంటే?

image

విడాకుల పుకార్లను పట్టించుకోకుండా ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే తమను ఇన్నాళ్లు కలిపి ఉంచిందని అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఐశ్వర్యా రాయ్‌తో 18 ఏళ్ల వైవాహిక బంధం వెనుక ఉన్న రహస్యాన్ని ఆయన పంచుకున్నారు. తమ వైవాహిక జీవితం నిలబడటానికి ‘తీవ్రమైన అహం’ కారణమని అభిషేక్ చెప్పారు. అయితే ఇక్కడ ‘అహం’(Ego) అంటే గర్వం కాదని, బంధాన్ని కాపాడుకోవాలనే పట్టుదల &ఆత్మగౌరవం అని వివరించారు.

News April 3, 2026

ట్రేడ్ డీల్.. ₹కోటి వరకు కార్ల ధరలు తగ్గింపు!

image

గతేడాది జరిగిన ఇండియా, UK ట్రేడ్ డీల్‌ నేపథ్యంలో జాగ్వార్ లాండ్ రోవర్ కార్ల ధరలు తగ్గనున్నాయి. ఇంపోర్ట్ డ్యూటీ 110% నుంచి 30 శాతానికి పడిపోవడం, GST సర్దుబాటుతో ధరలను 13-25% వరకు కంపెనీ తగ్గించనుందని తెలుస్తోంది. UKలో బిల్ట్ చేసిన టాప్ వేరియంట్లపై ₹1.06Cr ఆదా అవుతుందని సమాచారం. రేంజ్ రోవర్ స్పోర్ట్SV ఎడిషన్ రేటు ₹2.75Cr నుంచి ₹2.35Crకు, 4.4 లీటర్ పెట్రోల్SV ధర ₹4.25 Cr నుంచి ₹3.19Crకు దిగిరానుంది.