News April 22, 2024

పాకిస్థాన్ బియ్యంలో పురుగులు: రష్యా

image

పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో పురుగులు ఉన్నాయని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ బియ్యం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేవని, ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది. కాగా, బియ్యం ఎగుమతులపై గతేడాది భారత్ నిషేధం విధించడంతో పాక్ బియ్యానికి డిమాండ్ పెరిగింది. అమెరికా, బ్రిటన్, ఇతర యూరప్ దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.

Similar News

News April 13, 2026

వేతనం కోసం 16వేలమంది హోమ్ గార్డుల వెత

image

AP: పోలీస్, రవాణా, RTC విభాగాల్లోని 16వేల మంది హోమ్ గార్డులు జీతాల కోసం 10రోజులకు పైగా ఎదురుచూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. సాధారణంగా ప్రతినెల 1,2 తేదీల్లోనే వీరికి జీతం అందుతుంటుంది. ఈ శాఖల్లోని ఇతర ఉద్యోగులకు CFMS ద్వారా ఈనెల 11నే శాలరీ అందింది. వీరికి వేరే విభాగం నుంచి రోజుకు ₹710 చొప్పున నెలకు ₹21,300 వేతనం చెల్లించాల్సి ఉంది. కాగా సర్వర్ ఇష్యూతో జీతాలు ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.

News April 13, 2026

రాష్ట్రపతితో మంత్రి లోకేశ్ భేటీ

image

AP: కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ప్రెసిడెంట్‌కు లోకేశ్ వివరించారు. అటు ఢిల్లీలో ఈనెల 30 నుంచి మే 10 వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ అధికారులకు మంత్రి సూచించారు.

News April 13, 2026

మోనాలిసా కేసు.. భర్తకు హైకోర్టులో ఊరట

image

కుంభమేళా బ్యూటీ మోనాలిసా కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. మైనరైన ఆమెను కిడ్నాప్ చేశారంటూ నమోదైన కేసులో భర్త ఫర్మాన్ ఖాన్‌కు కేరళ హైకోర్టు ఊరటనిచ్చింది. మే 20 వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. కాగా మోనాలిసా మైనర్ అని NCST నిర్ధారించడంతో భర్తపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. మరోవైపు కొన్ని రోజులుగా మోనాలిసా కనిపించట్లేదని భర్త నిన్న <<19631395>>సెల్ఫీ వీడియో<<>> రిలీజ్ చేశారు.