News July 23, 2024

బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యి

image

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌ 2024-25లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్‌తో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది. రైలు మార్గాలు లేని జిల్లాలకు కొత్త ట్రాక్‌లు వస్తాయనే ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తలేదు.

Similar News

News March 27, 2026

పీరియడ్స్ ఆలస్యం.. ‘మార్చి’ని నిందిస్తున్న అమ్మాయిలు!

image

ఈ నెలలో తమ పీరియడ్స్ <<19484301>>ఆలస్యం<<>> అవుతున్నాయని, ‘మార్చి మంచిది కాదు’ అంటూ కొంతమంది అమ్మాయిలు SMలో పోస్టులు పెడుతున్నారు. కానీ అదంతా అపోహేనని వైద్యులు చెబుతున్నారు. FEBలో 28 రోజులే ఉండటం, MARలో వాతావరణం, సూర్యరశ్మిలో మార్పు వంటి సైంటిఫిక్ రీజన్స్ హార్మోన్ల విడుదలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. MARలోనే పరీక్షలు, రొటీన్ జాబ్ షిఫ్టుల స్ట్రెస్, ట్రావెల్ షెడ్యూల్సూ ఆలస్యానికి కారణమట.

News March 27, 2026

BREAKING: సీఎంలతో ప్రధాని వర్చువల్ మీటింగ్ స్టార్ట్

image

సీఎంలతో ప్రధాని మోదీ వర్చువల్‌గా భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశంపై దాని ప్రభావం, అనుసరించాల్సిన విధివిధానాలపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల సీఎంలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎస్‌లతో కేంద్రం విడిగా సమావేశం కానుంది. ఇక ఈ మీటింగ్‌కు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు.

News March 27, 2026

S-400 సహా రక్షణ కొనుగోళ్లకు ₹2.38 లక్షల కోట్లు

image

భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2.38 లక్షల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆధ్వర్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్(DAC) ఆమోదం తెలిపింది. రవాణా విమానాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ‘S-400’, డ్రోన్లు, యాంటీ ట్యాంక్ వ్యవస్థలు, రిమోట్‌తో నడిచే స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్టులు, ధనుష్ గన్ సిస్టమ్, ఏరియల్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను సేకరించనుంది.