News September 11, 2024

శీతల్ దేవి స్ఫూర్తిదాయక ట్వీట్

image

పారిస్ పారాలింపిక్స్‌లో మెడల్ సాధించిన ఆర్చర్ శీతల్ దేవి చేసిన ట్వీట్ వైరలవుతోంది. తనని తాను ఉద్దేశించుకుంటూ మంచి-చెడు రెండూ ఉంటాయని, భయపడకుండా ముందుకెళ్లాలని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ఎవరికైనా ఉదారంగా సహాయం చేయాలి. సోషల్ మీడియాలో ప్రశంసలు కోరుకోవద్దు. ఎవరినైనా క్షమించాలి, కానీ వారు చేసింది మర్చిపోవద్దు. కష్టంగా ఉన్నా నిజం వైపు ఉండాలి. ప్రియమైన వారితో సంతోష క్షణాలు ఆస్వాదించాలి’ అని తెలిపారు.

Similar News

News November 10, 2025

ఇన్‌స్టంట్ లోన్లవైపే ఎక్కువ మంది మొగ్గు

image

వడ్డీ ఎంతైనా ఫర్వాలేదు… పెద్దగా హామీ పత్రాల పనిలేకుండా ఇచ్చే ఇన్‌స్టంట్ లోన్లవైపే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. దీపావళి సీజన్లో ‘పైసాబజార్’ చేపట్టిన సర్వేలో 42% మంది ఈ లోన్లపై ఆసక్తిచూపారు. 25% మంది వడ్డీపై ఆలోచించారు. 80% డిజిటల్ ప్లాట్‌ఫాంల నుంచి లోన్లకు ప్రాధాన్యమిచ్చారు. కొత్తగా 41% పర్సనల్ LOANS తీసుకున్నారు. కాగా అనవసర లోన్లు సరికాదని, వాటి వడ్డీలతో కష్టాలే అని EXPERTS సూచిస్తున్నారు.

News November 10, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

➣ ఈ నెల 27న ఢిల్లీలో WPL మెగా వేలం
➣ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ స్టాండింగ్స్: మూడో స్థానంలో IND, తొలి రెండు స్థానాల్లో AUS, SL
➣ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఫరూక్ అహ్మద్‌కు గుండెపోటు.. ఐసీయూలో చికిత్స
➣ రంజీ ట్రోఫీ: తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్ విజయం.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రషీద్ (87), సెకండ్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ రెడ్డి (70), కరణ్ షిండే (51) హాఫ్ సెంచరీలు

News November 10, 2025

ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోదీ ఆరా

image

ఢిల్లీ <<18252218>>పేలుడు<<>> ఘటనపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. ఘటన ఎలా జరిగిందనే కారణాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు అతడిని ప్రశ్నిస్తున్నాయి. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.