News November 22, 2024

గంభీర్ మాటలతో స్ఫూర్తి పొందాను: నితీశ్ రెడ్డి

image

బౌన్సర్‌ అయినా సరే తట్టుకుని నిలబడాలని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత గౌతమ్ నాతో మాట్లాడారు. బౌన్సర్ వచ్చినప్పుడు దేశం కోసం తూటాకు అడ్డునిలబడినట్లే భావించాలని చెప్పారు. ఆ మాటలు నాలో నాటుకుపోయాయి. ఆయన్నుంచి నేను విన్న బెస్ట్ సలహా అది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 26, 2024

మళ్లీ సినిమాల్లో నటిస్తారా? రోజా సమాధానమిదే

image

మళ్లీ నటించాలని భావిస్తున్నట్లు మాజీ మంత్రి రోజా ఆసక్తి వ్యక్తపర్చారు. ‘బాహుబలి’ శివగామి, ‘అత్తారింటికి దారేది’ అత్త తరహా క్యారెక్టర్లు లేదా డాక్టర్, లాయర్ వంటి కీలక రోల్స్ చేయాలని కోరుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 90వ దశకంలో హీరోయిన్‌గా మెప్పించిన రోజా సెకండ్ ఇన్నింగ్స్‌లో గోలీమార్, మొగుడు లాంటి సినిమాల్లో నటించారు. ఈసారి ఆమెను ఏ రోల్‌లో చూడాలి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.

News November 26, 2024

భోజ్‌పురి ఇండస్ట్రీ పేరును వారు పాడుచేశారు: రవికిషన్

image

భోజ్‌పురి సినీ పరిశ్రమలో కొత్త తరం నటీనటులపై నటుడు రవి కిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ పేరును వారు పాడుచేస్తున్నారని మండిపడ్డారు. ‘భోజ్‌పురి సినీ పరిశ్రమలో నేను మూడో దశను ప్రారంభించాను. కానీ దాన్ని మా తర్వాతి తరం వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. పరిశ్రమకున్న పేరును చెడగొట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగులో రేసు గుర్రం, సైరా తదితర సినిమాల్లో ఆయన నటించారు.

News November 26, 2024

Warning: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?

image

ఆండ్రాయిడ్ 12- ఆండ్రాయిడ్ 15 వరకు ఆపరేటింగ్ సిస్టమ్స్‌ ఫోన్లను వాడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఓఎస్‌లో చాలా లోపాలున్నాయని భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) తేల్చిచెప్పింది. వీటిని హ్యాకర్లు గుర్తిస్తే వినియోగదారుల భద్రతకు తీవ్రస్థాయి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అప్‌డేట్స్ రాగానే వెంటనే ఫోన్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.