News April 5, 2024
ఇన్‌స్టా కలిపింది ఇద్దరినీ.. 80 వెడ్స్ 34!

మధ్యప్రదేశ్‌లోని సుస్నేర్‌లో బాలూరామ్ (80) అనే వృద్ధుడు మహారాష్ట్రకు చెందిన షీలా (34)ను వివాహమాడారు. బాలూరామ్‌తో ఫన్నీ రీల్స్ చేసి స్నేహితుడు విష్ణుగుజ్జార్ ఇన్‌స్టాలో షేర్ చేసేవారు. ఇవి చూసి షీలా బాలూరామ్‌తో పరిచయం పెంచుకున్నారు. ప్రేమ చిగురించడంతో ఈనెల 1న పెళ్లి చేసుకున్నారు. భార్యను కోల్పోవడం, ఆర్థిక సమస్యలతో డిప్రెషన్‌కు గురైన బాలూరామ్ కోలుకునేందుకు విష్ణు ఈ రీల్స్ చేయడం స్టార్ట్ చేశారట.
Similar News
News October 20, 2025
ఈ ‘ట్రాప్స్’తో పంటకు రక్షణ, దిగుబడికి భరోసా

వ్యవసాయంలో ప్రకృతి వైపరిత్యాల కంటే ఎక్కువ నష్టం చీడపీడల వల్లే జరుగుతుంది. వీటి నివారణకు లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, లైట్ ట్రాప్స్, విషపు ఎరలు వంటివి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి పురుగులను ఆకర్షించి, నిర్మూలించి వాటి ఉద్ధృతి, సంతతి పెరగకుండా కట్టడి చేస్తున్నాయి. వీటిని వినియోగించడం వల్ల రసాయన పురుగు మందుల వినియోగం తగ్గడమే కాకుండా, పర్యావరణానికి, మిత్రపురుగులకు ఎలాంటి హానీ కలగదు.
News October 20, 2025
తాజా సినీ ముచ్చట్లు!

* మెగాస్టార్ చిరంజీవి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. సైకిల్ తొక్కుతూ వింటేజ్ లుక్‌లో కనిపించారు.
*ధనుష్ నటించిన ‘సార్’ సినిమా కోసం తాను మొదట రవితేజను సంప్రదించినట్లు డైరెక్టర్ వెంకీ అట్లూరి తెలిపారు. బిజీ షెడ్యూల్ వల్ల కుదరలేదని వెల్లడించారు.
* శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తోన్న సినిమాకు ‘బైకర్’ టైటిల్ ఖరారు.
News October 20, 2025
మంగళగిరి ఎయిమ్స్‌లో ఉద్యోగాలు

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ 8 కాంట్రాక్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 24లోపు దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ, డిప్లొమా, LLB, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://www.aiimsmangalagiri.edu.in/