News May 7, 2025

ఇన్‌స్టా స్టార్ మృతి

image

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిషా అగర్వాల్ మరణించారు. సరదా కంటెంట్, వ్యంగ్యమైన రీల్స్‌తో అభిమానులను సంపాదించుకున్న ఆమె ఈనెల 25న పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. అయితే అంతకు 2 రోజులు ముందే మిషా చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఇవాళ ప్రకటన విడుదల చేశారు. మృతికి గల కారణాలు వెల్లడించలేదు. మిషాకు ఇన్‌స్టాలో 3.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘ది మిషా అగర్వాల్ షో’ ద్వారా యూట్యూబ్‌లోనూ ఆమె పాపులర్.

Similar News

News August 10, 2025

ఈసీ ఆదేశాలు TDP బేఖాతరు చేస్తోందంటూ YCP విమర్శలు

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నికల ప్రచారం సా.5గంటలతో ముగిసింది. అయినా, స్థానికేతర కూటమి నేతలు ఒంటిమిట్టలో తిష్ట వేశారని YCP నేతలు ఆరోపిస్తున్నారు. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హరిత హోటల్‌ వేదికగా టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కూటమి నేతలకు పోలీసులు మద్దతు పలుకుతున్నారని, ఎన్నికల సంఘం దీనిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.

News August 10, 2025

అల్పపీడనం.. 4 రోజులు అతిభారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 13, 14, 15, 16వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. చెట్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.

News August 10, 2025

పులివెందుల వైపే రాష్ట్రం చూపు..

image

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల బరిలో 11 మంది చొప్పున బరిలో ఉన్నా ప్రధాన పోటీ టీడీపీ, YCP అభ్యర్థుల మధ్యే ఉంది. పులివెందులలో హేమంత్ రెడ్డి(వైసీపీ), మారెడ్డి లతారెడ్డి(TDP) మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశముంది. ఒంటిమిట్టలో సుబ్బారెడ్డి(YCP), ముద్దు కృష్ణ రెడ్డి(టీడీపీ) బరిలో నిలిచారు. అటు వైసీపీ చీఫ్ జగన్ పులివెందుల MLA కావడంతో ఈ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.