News November 19, 2024
ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ డౌన్

ఈరోజు ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ డౌన్ అయింది. యూజర్ల నుంచి 1500కి పైగా ఫిర్యాదులు నమోదైనట్లు ఆన్లైన్ గ్లిచ్ పరిశీలన సంస్థ డౌన్డిటెక్టర్ తెలిపింది. 41శాతంమంది వినియోగదారులకు లాగిన్లో, మరో 41శాతంమంది సర్వర్ కనెక్షన్లలో ఇబ్బందులెదురైనట్లు పేర్కొంది. యాప్ను ఓపెన్ చేయలేకపోతున్నామని, మీడియా అప్లోడ్ చేయలేకపోతున్నామని అనేకమంది మెటాకు రిపోర్ట్ చేశారు.
Similar News
News January 14, 2026
-40 మార్కులు వస్తే డాక్టరా?.. ఆందోళన!

నీట్ పీజీ-2025లో రిజర్వ్డ్(SC,ST,BC) కేటగిరీలో <<18852584>>కటాఫ్<<>> తగ్గింపుపై డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -40 మార్కులు వచ్చినా క్వాలిఫై అయినప్పుడు ఎగ్జామ్ ఎందుకని ప్రశ్నలు లేవనెత్తింది. కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ట్రైనింగ్, ప్రాక్టీస్, సర్జరీల్లో పాల్గొనే అవకాశం కల్పించేలా ఉన్న ఈ నిర్ణయం బాధాకరమని తెలిపింది. కటాఫ్ తగ్గింపుపై పునరాలోచన చేయాలని, ఇది వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెబుతోంది.
News January 14, 2026
సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు కచ్చితంగా ఉండాలా?

ఇంటి సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు ఉండటం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఇది ఇంటికి అందంతో పాటు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చేస్తుందంటున్నారు. ‘మిగిలిన 3 దిక్కులలో ఒక్కో ద్వారం ఉంటే సరిపోతుంది. పెద్ద ఇళ్లకు 4 వైపులా ద్వారాలు ఉండటం ఉత్తమం. మారుతున్న చిన్న కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా కిటికీలు ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 14, 2026
ఇంట్రెస్టింగ్ మ్యాచ్.. ఎవరు గెలుస్తారో?

భారత్-న్యూజిలాండ్ రెండో వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 28 ఓవర్లలో 134/2 రన్స్ చేసింది. మిచెల్, యంగ్ హాఫ్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్ విజయానికి మరో 132 బంతుల్లో 151 రన్స్ అవసరం. ప్రసిద్ధ్, హర్షిత్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.


