News September 30, 2025
ఈవీలకు శబ్ద పరికరాలు అమర్చండి: కేంద్రం

ప్రయాణ సమయంలో ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, లారీల నుంచి శబ్దం వినిపించేలా పరికరాలను అమర్చాలని కేంద్రం ఆదేశించింది. పాదచారులు, ఇతర వాహనదారులు గుర్తించేందుకు అకౌస్టిక్ వెహికల్ అలర్టింగ్ సిస్టమ్(AVAS) అమర్చాలని పేర్కొంది. 2026 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే EVలకు తప్పనిసరి చేసింది. ప్రస్తుత వాహనాలకూ AVASలను అమర్చుకోవాలని తెలిపింది. శబ్దం రాకపోవడంతో జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News February 10, 2026
ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవం: DGP

TG: నాంపల్లి FSL అగ్నిప్రమాదంపై విచారణ జరుగుతోందని DGP శివధర్ రెడ్డి వెల్లడించారు. ఓటుకు నోటు కేసు ఫైల్స్ తగలబడ్డాయనేది అవాస్తవమని, ఆ కేసు ఫైల్స్‌ను 2021లోనే కోర్టుకు అందజేశామని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు రిపోర్టులూ ఇచ్చామన్నారు. HYD మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ప్రచార సమయంలో ₹3.09Cr పట్టుబడినట్లు వెల్లడించారు. మక్తల్ BJP అభ్యర్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేశామన్నారు.
News February 10, 2026
కోర్టుల్లో రాజకీయ పోరాటాలు చేయొద్దు: CJI

అస్సాం CM హిమంత బిశ్వ శర్మ <<19088953>>తుపాకీ వీడియో<<>> విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతూ కమ్యూనిస్టు పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ వివాదాలకు కేంద్రంగా న్యాయవ్యవస్థలను మార్చొద్దని హెచ్చరించింది. కోర్టుల్లో రాజకీయ పోరాటాలు చేయొద్దని కమ్యూనిస్టు పార్టీలకు CJI జస్టిస్ సూర్యకాంత్ హితవుపలికారు. అత్యవసరంగా విచారించాలన్న పిటిషన్ల వినతిని తోసిపుచ్చారు.
News February 10, 2026
బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. ఎన్నిక వాయిదా

TG: నారాయణపేట(D) మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డుకు పోటీ చేస్తున్న BJP అభ్యర్థి మహదేవప్ప మృతితో అక్కడి ఎన్నికను SEC వాయిదా చేసింది. మరో తేదీపై త్వరలో ప్రకటన చేయనుంది. కాగా రేపు పోలింగ్ జరగాల్సి ఉండగా నిన్న రాత్రి ఆయన <<19098651>>సూసైడ్<<>> చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులతోనే ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.


