News November 7, 2024
నేను YSRకు పుట్టలేదని అవమానించారు: షర్మిల

AP: తనపై అసభ్యకర పోస్టులు పెట్టిన రవీందర్ రెడ్డి అరెస్టును స్వాగతిస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ట్వీట్ చేశారు. ‘నేను వైఎస్ఆర్కు పుట్టలేదని అవమానించారు. ఇంటి పేరు మార్చి శునకానందం పొందారు. అసభ్యకర పోస్టులతో ప్రతిష్ఠ దెబ్బతీసేలా పోస్టులు పెట్టేవారిపై కఠినంగా చర్యలు ఉండాలి’ అని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడాలంటే భయపడేలా అనునిత్యం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Similar News
News December 10, 2025
మొదలైన లారీల బంద్

TGలో లారీల టెస్టింగ్, ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని తెలిపింది. 13ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్నెస్, టెస్టింగ్ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, తాజాగా రూ.30వేలకు పెంచారని మండిపడ్డారు. అటు APలో లారీ ఓనర్ అసోసియేషన్తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది.
News December 10, 2025
ఎండినవారికి ఇనుము తిండి

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.
News December 10, 2025
గణపతి స్తోత్రాన్ని ఎప్పుడు పఠించడం ఉత్తమం?

వినాయకుడి స్తోత్రాలు పఠించడానికి బుధవారం ఉత్తమ దినమని పండితులు చెబుతున్నారు. శుభ దినాలప్పుడు కూడా ప్రారంభించవచ్చని, సంకష్టహర చతుర్థి రోజున మొదలుపెట్టడం మరింత మేలని అంటున్నారు. ‘ప్రారంభించిన తర్వాత రోజూ పఠించడం చాలా ముఖ్యం. ఉదయాన్నే స్నానం చేసి, శుచిగా దీపారాధన చేసి, గణేశునికి కొంచెం గరిక, నైవేద్యాన్ని సమర్పించి స్తోత్రాన్ని పఠించాలి. చివరగా హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి’ అని సూచిస్తున్నారు.


