News February 19, 2025
RTCలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇన్సూరెన్స్

APSRTCలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు రూ.10లక్షల ప్రమాద బీమా వర్తించనుంది. అద్దె బస్సులు, ఔట్ సోర్సింగ్ డ్రైవర్లు, బస్సుల్లో అటెండర్లు, బస్టాండ్లు, గ్యారేజీలు, స్వీపర్లు, గైడ్లు, కౌంటర్లలో బస్ టికెట్లు జారీ చేసే సిబ్బందికి ఇది వర్తించనుంది. దీనికి వారిని నియమించుకున్న కాంట్రాక్టర్ ఒక్కొక్కరికి రూ.499 చొప్పున పోస్టల్ శాఖ అంత్యోదయ శ్రామిక్ సురక్ష యోజన బీమాకు ప్రీమియం చెల్లించాలి.
Similar News
News October 23, 2025
ఇంటి చిట్కాలు

* చెత్తబుట్టలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. బుట్ట అడుగు భాగంలో కొంచెం బొరాక్స్ పొడి చల్లాలి.
* కాస్త వెనిగర్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి డైనింగ్ టేబుల్ తుడిస్తే ఎలాంటి మరకలైనా పోతాయి.
* ట్యాపులపై ఉండే మచ్చలు పోయి కొత్తవాటిలా మెరవాలంటే వారానికోసారి నిమ్మకాయ ముక్కతో రుద్దాలి.
* కొవ్వొత్తులను వెలిగించే ముందు వాటి పైభాగాన కాస్త ఉప్పు రాస్తే ఎక్కువ సమయం వెలుగుతాయి.
News October 23, 2025
ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలివిగో!

సాధారణంగా వేధించే ఆరోగ్య సమస్యలకు తగిన విటమిన్లు, ఖనిజాలు తీసుకోవడం ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. జుట్టు రాలకుండా ఉండేందుకు బయోటిన్ (B7)& A, E, అలసటకు విటమిన్ B12& D& ఐరన్, మొటిమలకు విటమిన్ A& జింక్, పొడి చర్మానికి విటమిన్ C & E, ఒమేగా-3 వంటివి ప్రయోజనకరం. తలనొప్పికి మెగ్నీషియం & B2, వీక్నెస్కి B1& D & మెగ్నీషియం ఆహారంలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. SHARE IT
News October 23, 2025
ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ ఫస్ట్ లుక్ రివీల్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న సినిమా టైటిల్ రివీలైంది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ టైటిల్ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో బియర్డ్ లేకుండా ప్రభాస్ పవర్ఫుల్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్ అనే ట్యాగ్లైన్ ఇచ్చారు. అలాగే ఓ సంస్కృత శ్లోకాన్ని మేకర్స్ ట్వీట్లో రాసుకొచ్చారు.