News August 29, 2024
డెలివరీ బాయ్స్‌కు బీమా కల్పించండి: KTR

స్విగ్గీ సీఈవో శ్రీహర్ష మాజేటిని కేటీఆర్ అభినందించారు. చిన్నతనంలో కుటుంబంలో తామే డెలివరీ బాయ్స్ అని, తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకునేవారమని గుర్తుచేశారు. ‘అభివృద్ధి చెందుతున్న గిగ్ వర్కర్ పరిశ్రమలో హైదరాబాద్ ఒకటి. ప్రతి నెలా 45 శాతం కంటే ఎక్కువ వ్యాపారం పెరుగుతోంది. కాబట్టి గిగ్ వర్కర్లకు సరైన వర్క్ అట్మాస్పియర్, మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు, బీమా, సామాజిక భద్రత కల్పించాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 14, 2025
APPLY NOW: SBIలో 10 పోస్టులు

SBI 10 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు ఈనెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, PGDM, PGDBM, CFA/FRM/CA అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://sbi.bank.in/
News October 14, 2025
చలిగాలి చూడు.. గిలిగింత పెడుతున్నది!!

తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ఎండింగ్‌కు చేరిందో లేదో వింటర్ ఎంటరైంది. కొద్ది రోజులుగా ఉభయ రాష్ట్రాల్లో రాత్రివేళ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. కొన్నిచోట్ల టెంపరేచర్ సగటున 18-16కు పడిపోతోంది. దీంతో తెల్లవారుజామున పనులకు వెళ్లాల్సిన వారు, కసరత్తులతో కాస్త ఒళ్లు కరిగిద్దాం అనుకున్న వారు అలారాన్ని ఓసారి స్నూజ్ చేసి కానీ లేవడం లేదు. బయటకు వచ్చాక కూడా చల్లగాలులతో మెల్లగా వణుకు మొదలైంది. మీకూ…?
News October 14, 2025
ఈ మాస్క్‌తో అవాంఛిత రోమాలకు చెక్

చాలామంది అమ్మాయిలను వేధించే సమస్య అవాంఛిత రోమాలు. అయితే ఈ ప్యాక్‌తో వాటిని ఇంట్లోనే తొలగించుకోవచ్చు. చెంచా జెలటిన్ పొడిలో చల్లార్చిన పాలు, తేనె, చిటికెడు పసుపు కలపాలి. ముఖాన్ని శుభ్రం చేసుకొని వేడి నీళ్లలో ముంచిన క్లాత్‌తో అద్దుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మాస్క్ తీసేసి ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని రుద్దుకోవాలి. ఇలా చేస్తే క్రమంగా అవాంఛితరోమాలు దూరమవుతాయి.