News November 23, 2024
26 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు

TG: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 26 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసింది. ఈ లిస్టులో జగిత్యాల, రామగుండం, ధర్మపురి, వనపర్తి, బోధన్, డోర్నకల్, చొప్పదండి, PDPL, వైరా, కోదాడ, కొత్తగూడెం, కల్వకుర్తి, సత్తుపల్లి, నకిరేకల్, నాగార్జున సాగర్, తాండూరు, నారాయణ్ పేట, NZB రూరల్, చేవెళ్ల, జుక్కల్, మక్తల్, వికారాబాద్, గద్వాల, మెదక్, మేడ్చల్, ఆర్మూరు నియోజకవర్గాలు ఉన్నాయి.
Similar News
News January 5, 2026
నష్టాల్లో మార్కెట్స్.. IT సెక్టార్ డౌన్

భారత సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 180 పాయింట్లకు పైగా నష్టపోయి 85,570 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 26,300 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2% వరకు నష్టాల్లో కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, విప్రో, HCL వంటి దిగ్గజ ఐటీ సంస్థల స్టాక్స్ ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
News January 5, 2026
APPLY NOW: AVNL ఉద్యోగాలు

చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL)లో 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE, BTech, PG, PhD, డిప్లొమా, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 6వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కన్సల్టెంట్, Sr.కన్సల్టెంట్‌కు నెలకు రూ.1,20,000+IDA, Sr. మేనేజర్‌కు రూ.70000+IDA, Jr. మేనేజర్‌కు రూ.30,000+IDA చెల్లిస్తారు.
News January 5, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,580 పెరిగి రూ.1,37,400కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,450 ఎగబాకి రూ.1,25,950 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8,000 పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


