News May 9, 2024
నేటి నుంచి ఇంటర్ ప్రవేశాలు
TG: రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అన్ని కాలేజీలు ఈ షెడ్యూల్‌ను పాటించాలని ఆదేశించారు. ప్రైవేట్ కాలేజీలు ప్రవేశాల కోసం ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అడ్మిషన్లకు సంబంధించి ప్రకటనలు ఇవ్వరాదని హెచ్చరించారు.
Similar News
News January 7, 2025
ALERT.. రేపటి నుంచి జాగ్రత్త
తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనవరి 8 నుంచి 11 వరకు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం వేళ పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
News January 7, 2025
టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ ఈవో
AP: తిరుమలలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ నెల 10 నుంచి పది రోజుల్లో 7.5 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 3వేల మంది పోలీసులు, 1500 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తామని తెలిపారు. టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠద్వార దర్శనాలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజుల్లో వీఐపీలు స్వయంగా వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు.
News January 7, 2025
అందరూ వెళ్లిపోయారు.. కానీ మోదీ ఆట ఇంకా నడుస్తోంది: బీజేపీ
2014 నుంచి ఇప్పటి దాకా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఓడినవారు కొందరైతే, వివిధ కారణాలతో తప్పుకున్నవారు ఇంకొందరు. ఇలా మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక US మొదలుకొని ఆస్ట్రేలియా వరకు ఎందరో దేశాధినేతలు పదవుల నుంచి తప్పుకున్నారు. తాజాగా కెనడా PM జస్టిన్ ట్రూడో కూడా. దీంతో ‘అందరూ వెళ్లిపోయారు, కానీ PM మోదీ ఆట ఇంకా నడుస్తోంది. Ultimate Big Boss Energy!’ అంటూ BJP పేర్కొంది.