News April 12, 2025

KGBVల్లో ఇంటర్ ప్రవేశాలు.. గడువు పొడిగింపు

image

AP: రాష్ట్రంలోని KGBVల్లో ఇంటర్ ఫస్ట్, సెకండియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 21 వరకు పొడిగించారు. SC, ST, BC, మైనారిటీ, డ్రాపౌట్స్, అనాథలు మాత్రమే అప్లై చేసుకోవాలని సమగ్ర శిక్ష సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తామన్నారు.
వెబ్‌సైట్: <>https://apkgbv.apcfss.in/<<>>

Similar News

News December 28, 2025

ఐబొమ్మ రవి కేసులో ఆసక్తికర పరిణామం

image

TG: ప్రహ్లాద్ పేరిట ఐబొమ్మ రవికి పాన్‌, డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంపై పోలీసులు ఆరా తీశారు. అతడు తన రూమ్‌మేట్ అని గతంలో రవి చెప్పారు. దీంతో బెంగళూరు నుంచి ఇవాళ ప్రహ్లాద్‌ను పిలిపించి రవి ఎదుటే ప్రశ్నించారు. అయితే రవి ఎవరో తనకు తెలియదని, తన పేరుతో పాన్, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్ అయ్యానని ప్రహ్లాద్ చెప్పినట్లు తెలుస్తోంది. అతడి డాక్యుమెంట్లను రవి దొంగిలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

News December 28, 2025

VHTలో ఆడనున్న శ్రేయస్ అయ్యర్!

image

గాయం కారణంగా టీమ్‌కు దూరమైన వైస్ కెప్టెన్(ODI) శ్రేయస్ అయ్యర్ తిరిగి మైదానంలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. అతను పూర్తిగా కోలుకున్నట్లు BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(COE)లోని వైద్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ముంబై తరఫున జనవరి 3, 6న విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటారని, తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌కు అందుబాటులోకి వస్తారని సమాచారం. OCT 25న AUSతో మ్యాచ్‌లో అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే.

News December 28, 2025

డ్రెస్సింగ్‌పై నిధి అగర్వాల్ ఏమన్నారంటే?

image

హీరోయిన్ నిధి అగర్వాల్ #ASKNIDHI అంటూ ట్విట్టర్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇందులో భాగంగా ఒకరు ‘ఏ కాస్ట్యూమ్/అవుట్ ఫిట్ ధరించడం మీకు ఇష్టం?’ అని అడిగారు. అందుకు ‘నన్, ఏంజెల్ కాస్ట్యూమ్ ఇష్టం’ అంటూ నిధి చెప్పారు. ఆమె రాజాసాబ్ చిత్రంలో నన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్స్ వస్త్రధారణపై జరుగుతున్న చర్చలో <<18661197>>నిధి<<>> పేరు హైలైట్ కావడంతో ఆమె ఇచ్చిన ఆన్సర్ SMలో వైరలవుతోంది.