News June 19, 2024
25న ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలు

TG: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, ఫస్టియర్ ఇంప్రూవ్మెంట్ కోసం రాసిన వారు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. గత పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీకోడింగ్, ఆన్లైన్లో మార్కుల ఎంట్రీ పూర్తైంది. ఏవైనా అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఈ నెల 26 లేదా 27న విడుదల చేస్తారు.
Similar News
News November 24, 2025
వ్యవసాయంలో ఏటా 15% వృద్ధే లక్ష్యం: సీఎం

AP: ఇవాళ్టి నుంచి రైతన్నా.. మీకోసం కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నదాతలకు లేఖ రాశారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏటా 15% వృద్ధి రేటే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ‘రైతుల కోసం అన్నదాత సుఖీభవ, కిసాన్ డ్రోన్ సేవలు, బిందు సేద్యానికి సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News November 24, 2025
ఇది సరిగా ఉంటే ఆరోగ్యం మీ వెంటే..

మనిషి జీవనశైలిని నియంత్రించేది జీవ గడియారం. అంటే బయోలాజికల్ క్లాక్. రోజువారీ జీవితంలో నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, జీవరసాయన ప్రక్రియలు సమయానికి జరిగేలా చూస్తుంది. అయితే దీంట్లో సమతుల్యత లోపిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. శారీరకంగా, మానసికంగా క్రమంగా శక్తిహీనులుగా మారిపోతుంటే అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News November 24, 2025
భారీగా పెరిగిన కూరగాయల ధరలు!

TG: కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లు, వారాంతపు సంతల్లో ఏ కూరగాయ అయినా కేజీ రూ.80 నుంచి రూ.120 పలుకుతోంది. తోటకూర కిలో రూ.90 వరకు అమ్ముతుండగా, పాలకూర రేటు రూ.160కి చేరింది. బీర, బెండ, కాకర, క్యాప్సికం, చిక్కుడు, వంకాయ రేట్లు గత 2 నెలలతో పోలిస్తే డబుల్ అయ్యాయి. తుఫాన్ ప్రభావంతో పంట నష్టం, దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.


