News February 13, 2025

ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక

image

TG: ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ రాకముందే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టొద్దని ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు సూచించింది. ఒకవేళ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టినట్లు కొన్ని కాలేజీలపై ఫిర్యాదు వచ్చాయని అధికారులు తెలిపారు. గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని విద్యార్థులకు సూచించారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలను https://tgbie.cgg.gov.in/ <>సైట్‌లో<<>> పెడతామన్నారు.

Similar News

News January 30, 2026

పొడవైన నడక దారి.. మొత్తం 22,387కి.మీలు

image

దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి రష్యాలోని మగదాన్ వరకు ఉన్న మార్గం ప్రపంచంలోనే అత్యంత పొడవైన నడక దారి. ఇది 17 దేశాల గుండా సుమారు 22,387 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎక్కడా విమానాలు లేదా పడవలు అవసరం లేదు. కేవలం నడిచి వెళ్లవచ్చు. అయితే యుద్ధాలు, వీసా కష్టాలు, విపరీతమైన చలి వల్ల దీనిని పూర్తి చేయడం దాదాపు అసాధ్యం. ఇప్పటివరకు ఎవరూ ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని సాహసించలేదు.

News January 30, 2026

అమ్మాయిలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ అందించాలి: సుప్రీంకోర్టు

image

మహిళల Menstrual health వారి జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్కూల్ అమ్మాయిలందరికీ బయో డీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందేలా చూడాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే ప్రతి స్కూల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉండాలని, అవి వికలాంగులకూ అనుకూలంగా ఉండాలని సూచించింది. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఇవి పాటించకపోతే వాటి గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.

News January 30, 2026

కాంగ్రెస్‌లోనే ఉంటా: థరూర్

image

తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, ఎక్కడికీ వెళ్లడం లేదని INC MP శశిథరూర్ స్పష్టం చేశారు. కేరళ ఎన్నికల్లో UDFను గెలిపించేందుకు పనిచేస్తానన్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న థరూర్ తాజాగా అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌తో భేటీ అయ్యారు. పార్టీతో విభేదాలు లేవని మీడియాతో పేర్కొన్నారు. ‘నేను చేసిన వ్యాఖ్యలు BJPకి అనుకూలమని కొందరు భావించొచ్చు. కానీ అవి భారత్‌కు అనుకూలం. రాహుల్ నిజాయతీ కల నేత’ అని పేర్కొన్నారు.