News October 2, 2024
ఉచితంగా ఇంటర్ డూప్లికేట్ సర్టిఫికెట్లు

AP: వరదల కారణంగా సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి ఇంటర్మీడియట్ విద్యామండలి గుడ్ న్యూస్ చెప్పింది. అలాంటి వారందరికీ డూప్లికేట్ సర్టిఫికెట్లను ఉచితంగా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో వరదలకు ఇళ్లు నీట మునగడంతో చాలా మంది సర్టిఫికెట్లు తడిచి పాడైపోయాయి. దీంతో ఎలాంటి ఫీజు లేకుండా డూప్లికేట్ పత్రాలు ఇవ్వనుంది.
Similar News
News January 16, 2026
ఢిల్లీలో కలవరపెడుతున్న శ్వాసకోశ మరణాలు

ఢిల్లీలో శ్వాసకోశ వ్యాధుల కారణంగా 2024లో 9,211 మంది మృతి చెందినట్లు ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఇది 2023తో పోలిస్తే 410 ఎక్కువ మరణాలుగా అధికారులు తెలిపారు. ఆస్తమా, న్యుమోనియా, టీబీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. జననాల సంఖ్య తగ్గడం, మరణాల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విమర్శలు వస్తున్నాయి.
News January 16, 2026
జనవరి 16: చరిత్రలో ఈ రోజు

1938: మల్ల యుద్ధ వీరుడు కోడి రామమూర్తి మరణం
1942: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జననం (ఫొటోలో)
1943: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి మరణం
1978: సినీ దర్శకుడు భీమ్ సింగ్ మరణం
1988: భారత ఆర్థికవేత్త ఎల్.కె.ఝా మరణం
1989: సినీ నటుడు ప్రేమ్ నజీర్ మరణం
2016: బాలీవుడ్ దర్శకుడు అనిల్ గంగూలీ మరణం
News January 16, 2026
జనవరి 30న నీటి వివాదాలపై తొలి కీలక సమావేశం

తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల పరిష్కారానికి కీలక అడుగు పడనుంది. AP, TG, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, CWC అధికారులతో కూడిన అధికారిక కమిటీ తొలి సమావేశం జనవరి 30న ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశంలో పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య నీటి యాజమాన్య వివాదాలపై చర్చ జరగనుంది. KRMB, GRMB ప్రతినిధులు కూడా పాల్గొని తాజా పరిస్థితులపై నివేదికలు సమర్పించనున్నారు.


