News October 25, 2025
ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

TG: ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది.
Similar News
News October 25, 2025
చీర కట్టుకుంటున్నారా..? ఇలా చేస్తే సూపర్ లుక్

ఎంత ట్రెండీ, ఫ్యాషన్ డ్రెస్సులున్నా ప్రత్యేక సందర్భాల్లో మహిళలు చీరకే ఓటేస్తారు. అయితే చీర కట్టడంలో కొన్ని టిప్స్ పాటిస్తే లుక్ అదిరిపోతుంది. చీర ఎంత ఖరీదైనా అది మనకు నప్పకపోతే బావుండదు. కాబట్టి మీ ఒంటికి నప్పే రంగు ఎంచుకోవాలి. లైట్ కలర్ చీరైతే మంచి ప్రింట్స్ ఉండేలా చూసుకోవాలి. సరిగ్గా ఫిట్ అయ్యే బ్లౌజ్ వేసుకోవాలి. అప్పుడప్పుడూ డిఫరెంట్‌గా చీర కట్టడం ట్రై చేయాలి. చీరను బట్టి జ్యువెలరీ ఎంచుకోవాలి.
News October 25, 2025
కోహ్లీ&రోహిత్ ‘క్యాచుల’ రికార్డు

భారత స్టార్ ప్లేయర్ కోహ్లీ AUSతో జరుగుతున్న మూడో వన్డేలో అరుదైన రికార్డు సృష్టించారు. AUSలో AUSపై అత్యధిక క్యాచ్‌లు(38*) పట్టిన ప్లేయర్‌గా నిలిచారు. ఇవాళ 2 క్యాచ్‌లు పట్టి ఇయాన్ బోథమ్(36) పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. అటు రోహిత్ శర్మ 100 క్యాచెస్ క్లబ్‌లో చేరారు. ఈ లిస్ట్‌లో కోహ్లీ(163*), అజారుద్దీన్(156), సచిన్(140), ద్రవిడ్(124), రైనా(102) తర్వాత ఆరో ప్లేయర్‌గా చోటు దక్కించుకున్నారు.
News October 25, 2025
ఇతర పదవుల్లో ఉండే వారికి DCC రాదు: PCC చీఫ్

TG: సమర్థులను DCC అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ‘జిల్లాల నుంచి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. కనీసం 5ఏళ్లు పార్టీలో పనిచేసి ఉండాలన్న నిబంధన ఉంది. మ.3కు అధిష్ఠానం CM, Dy.CMతో పాటు నా అభిప్రాయం తీసుకొని లిస్టు ఫైనల్ చేస్తుంది. సామాజిక న్యాయం ప్రకారం ఎంపిక ఉంటుంది. ఇప్పటికే పదవుల్లో ఉన్నవారికి DCC ఇవ్వరాదనే నియమం ఉంది. అలాంటి వారికి ఈ పదవి రాదు’ అని స్పష్టం చేశారు.


