News January 30, 2025

నేటితో ఇంటర్ పరీక్షల ఫీజు గడువు ముగింపు

image

AP: మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువు ఇవాళ్టితో ముగియనుంది. జనరల్, ఒకేషనల్, ఫస్ట్, సెకండ్ ఇంటర్ విద్యార్థులకు తత్కాల్ స్కీం కింద రూ.3 వేల ఫైన్‌తో నేటి వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News January 10, 2026

‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకంలో రాయితీ ఇలా..

image

ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి దీనిలో వాటా ఉంటుంది. సన్న, చిన్నకారు, మహిళా రైతులు, SC, ST, BC రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ధరలో 50% వారు భరించాలి. మిగిలిన 50 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60 శాతం వాటాను భరించాల్సి ఉండగా.. 40 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.

News January 10, 2026

ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా?

image

ప్ర‌యాణాల్లో వాంతులు అవ‌డం అనేది సాధార‌ణంగా చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య. వికారంగా అనిపించ‌డం, త‌ల తిర‌గ‌డం, పొట్ట‌లో అసౌకర్యంగా ఉండడం ఇవ‌న్నీ మోష‌న్ సిక్‌నెస్ ల‌క్ష‌ణాలు. దీన్ని తగ్గించాలంటే అల్లం రసం, హెర్బల్ టీ వంటివి తాగాలి. శ్వాస వ్యాయామాలు చేయాలి. నిమ్మకాయ వాసన చూసినా వికారం తగ్గుతుంది. అలాగే ప్రయాణానికి ముందు తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారం తీసుకోవాలి. హెవీ ఫుడ్స్‌ సమస్యను మరింత పెంచుతాయి.

News January 10, 2026

తిరుమల శ్రీవారికి ఆయుధాలు లేవా?

image

తిరుమల శ్రీవారు ఆయుధాలు లేకుండా దర్శనమిస్తారు. దీనికొక పురాణ గాథ ఉంది. పూర్వం సింహాద అనే రాక్షసుడిని సంహరించడానికి శ్రీనివాసుడు తన శంఖుచక్రాలను తొండమాన్ చక్రవర్తికి ఇచ్చారు. ఆయన ఆయుధాలు లేకుండానే స్వామివారు భక్తులకు దర్శనమివ్వాలని కోరారు. భక్తుడి కోరిక మేరకే మూలవిరాట్టుకు ఆయుధాలు ఉండవు. ప్రస్తుతం ఉన్న శంఖుచక్రాలు భక్తులు సమర్పించిన ఆభరణాలు. అసలు ఆయుధాలు తిరుమలలోని వివిధ తీర్థాలుగా వెలిశాయి.