News March 5, 2025
రాష్ట్రంలో నేటి నుంచే ఇంటర్ ఎగ్జామ్స్

TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. 4,88,448 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్, అనలాగ్ వాచ్‌లపై నిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Similar News
News March 5, 2025
కుంభమేళాలో రూ.30 కోట్లు సంపాదించిన ఫ్యామిలీ: సీఎం

కిడ్నాప్, చోరీ, మర్డర్ లాంటి ఘటనలు జరగకుండా మహాకుంభమేళాను విజయవంతంగా నిర్వహించామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తే పలు రంగాలకు రూ.3లక్షల కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అనేక కుటుంబాలు లాభపడ్డాయని తెలిపారు. ఓ ఫ్యామిలీ 130 బోట్లను నడిపిస్తూ రూ.30కోట్లు సంపాదించిందని పేర్కొన్నారు. రోజుకు ఒక్కో బోటు నుంచి రూ.52వేలు లాభం పొందిందని ఓ సక్సెస్ స్టోరీని వివరించారు.
News March 5, 2025
TTD Update: నేరుగా శ్రీవారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు శ్రీవారి దర్శనం నేరుగా లభిస్తోంది. నిన్న శ్రీవారిని 64,861 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.3.65 కోట్ల ఆదాయం సమకూరింది.
News March 5, 2025
KCR వ్యూహం.. ఒకరా? ఇద్దరా?

TG: MLAల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా BRS అధినేత కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. MLAల సంఖ్యా పరంగా BRSకు ఒక స్థానం కచ్చితంగా దక్కనుండగా, రెండో అభ్యర్థిని కూడా బరిలోకి దించే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే ఓటింగ్ తప్పనిసరి కానుంది. దీంతో పార్టీ మారిన 10 మంది MLAల ఓటు కీలకం కానుంది. వీరిని ఇరుకున పెట్టాలని KCR భావిస్తున్నారు.