News March 1, 2025
ఇంటర్ పరీక్షలు.. విద్యార్థి ఆత్మహత్య

TG: పరీక్షల ఒత్తిడి ఇంటర్ విద్యార్థి ప్రాణాలు బలితీసుకుంది. హైదరాబాద్లోని చందానగర్కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈక్రమంలోనే నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయాడు. విద్యార్థి దశలో పరీక్షలు ఒక భాగమని, వాటికి భయపడొద్దని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Similar News
News January 13, 2026
భారత్కు మరో S-400.. వచ్చేది ఎప్పుడంటే?

భారత రక్షణ శక్తి మరింత బలోపేతం కానుంది. రష్యా నుంచి నాలుగో S-400 క్షిపణి వ్యవస్థ ఈ ఏడాది మే నాటికి భారత్కు అందనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2018లో కుదిరిన రూ.40 వేల కోట్ల ఒప్పందం ప్రకారం మొత్తం 5 వ్యవస్థలు కొనుగోలు చేయగా, ఇప్పటికే 3 భారత్కు చేరాయి. నాలుగోది ఈ ఏడాది మేలో, చివరిది 2027లో డెలివరీ కానుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400లు అద్భుతంగా పని చేసిన విషయం తెలిసిందే.
News January 13, 2026
ఐఫోన్ యూజర్లకు అలర్ట్

ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘జీరో క్లిక్ స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు తెలిపింది. లింక్ క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 11 నుంచి ఆపై మోడల్స్ ఉపయోగిస్తున్న వారు iOS 26కి వెంటనే అప్డేట్ కావాలని సూచించింది. అదనంగా లాక్డౌన్ మోడ్ ఆన్ చేయడం, ఫోన్ను తరచూ రీబూట్ చేయడం ద్వారా రక్షణ పెరుగుతుందని స్పష్టం చేసింది.
News January 13, 2026
ప్రేక్షకులు లేకుండానే WPL మ్యాచ్లు!

WPLలో భాగంగా జనవరి 14, 15 తేదీల్లో జరిగే మ్యాచ్లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 15న ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దీంతో DY పాటిల్ స్టేడియంలో జరిగే DC-UPW, MI-UPW మ్యాచ్లకు సరిపడా భద్రత కల్పించలేమని పోలీసులు BCCIకి తెలియజేశారు. ఈ తేదీలకు సంబంధించిన టికెట్లను అమ్మకానికి పెట్టలేదు. 16న జరిగే మ్యాచ్కు సంబంధించిన టికెట్లు సైతం ప్రస్తుతానికి అందుబాటులో లేవు.


