News February 7, 2025
వాట్సాప్లో ఇంటర్ హాల్టికెట్లు.. టెన్త్ కూడా
AP: ఫీజులు చెల్లించలేదని ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులకు హాల్టికెట్లు నిలిపివేసే ఘటనలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇంటర్ హాల్టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని నిర్ణయించింది. 9552300009 నంబర్ ద్వారా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. త్వరలో టెన్త్ విద్యార్థులకు సైతం ఇదే అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 10-20 వరకు, పరీక్షలు మార్చి 1-20 వరకు జరుగుతాయి.
Similar News
News February 7, 2025
గజ్వేల్: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు మరోకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే క్షతగాత్రులను గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు.
News February 7, 2025
రేపటి నుంచి TG ఓపెన్ చెస్ టోర్నీ
TG: రేపు, ఎల్లుండి చర్లపల్లిలో ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు స్టేట్ చెస్ అసోసియేషన్ (TSTA) తెలిపింది. బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో అండర్ 7, 9, 11, 13, 15 విభాగాల్లో పోటీలు ఉంటాయని TSTA ప్రెసిడెంట్ KS ప్రసాద్ పేర్కొన్నారు. ఇందులో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుందని, వివరాలకు 7337578899, 7337399299 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
News February 7, 2025
OTTలోకి వచ్చేసిన ‘గేమ్ ఛేంజర్’
శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. జనవరి 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కియారా, అంజలి, SJ సూర్య, జయరాం కీలక పాత్రల్లో నటించారు.