News February 25, 2025
ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. త్వరలో మొబైల్స్‌కు లింకులు

TG: ఇంటర్ హాల్ టికెట్లను రిలీజ్ చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. కాలేజీల లాగిన్లలో హాల్ టికెట్లు అప్లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ల డౌన్లోడ్ లింకును పంపిస్తామన్నారు. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
Similar News
News February 25, 2025
‘ఛావా’ కలెక్షన్ల దండయాత్ర

బాక్సాఫీస్ వద్ద ‘ఛావా’ మూవీ దండయాత్ర కొనసాగుతోంది. విడుదలైన 11 రోజుల్లో ఈ సినిమా భారతదేశంలో రూ.353.61 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నిన్న ఒక్క రోజే రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు వెల్లడించాయి. మరాఠా యోధుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ లీడ్ రోల్లో నటించారు.
News February 25, 2025
జియో హాట్‌స్టార్‌కు పోటీగా.. ఎయిర్టెల్, టాటాప్లే జింగాలాలా..

జియో హాట్‌స్టార్ తర్వాత మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో మరో 2 కంపెనీలు విలీనం కాబోతున్నట్టు తెలిసింది. స్వాప్‌డీల్ ద్వారా భారతీ ఎయిర్టెల్ తమ DTH బిజినెస్ ఎయిర్టెల్ డిజిటల్ టీవీని టాటా ప్లేతో మెర్జ్ చేయనుందని సమాచారం. ఎయిర్టెల్ 52-55%, టాటా 45-48% వాటా తీసుకుంటాయని తెలిసింది. ఇదే జరిగితే టాటా ప్లేకు ఉన్న 1.9 కోట్ల హోమ్స్, 5 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఎయిర్టెల్ పరిధిలోకి వస్తాయి.
News February 25, 2025
మోడల్ స్కూల్ దరఖాస్తుల గడువు పెంపు

TG: మోడల్ స్కూళ్ల దరఖాస్తు గడువును మార్చి10వ వరకు పెంచినట్లు విద్యాశాఖ తెలిపింది. ఈనెల 28వ తేదీతో గడువు ముగుస్తుండగా మార్చి10 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం GO జారీ చేసింది. మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10తరగతుల ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫీజు ఓసీలు రూ.200, ఇతర వర్గాల వారు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. సైట్: https://telanganams.cgg.gov.in/