News February 2, 2025

సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలోనే ఇంటర్ ప్రాక్టికల్స్

image

TG: ఇంటర్ ప్రాక్టికల్స్ కోసం ప్రైవేటు కాలేజీల్లో CCTV కెమెరాల ఏర్పాటుకు యాజమాన్యాలు అంగీకరించాయని బోర్డు అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి ఈనెల 22 వరకు జరగనున్న పరీక్షలకు 4.29 లక్షల మంది హాజరు కానుండగా, 2,008 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హాల్ టికెట్లను కాలేజీ లాగిన్లతో పాటు విద్యార్థుల ఫోన్లకు పంపుతున్నామన్నారు. రెండు సెషన్లలో (9am-12pm, 2pm-5pm) పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News November 11, 2025

ఢిల్లీలో ఆత్మాహుతి దాడి? కారులో ఉన్నది అతడేనా?

image

ఢిల్లీ పేలుడు ఆత్మాహుతి దాడేమోనని ఇన్వెస్టిగేషన్ సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పుల్వామాకు చెందిన సల్మాన్ నుంచి డా.ఉమర్ మహ్మద్ i20 కారు తీసుకున్నట్లు భావిస్తున్నాయి. బ్లాస్ట్‌కు ముందు కారులో బ్లాక్ మాస్క్‌తో ఉన్నది ఉమరేనా అనే కోణంలో విచారణ చేపట్టాయి. ప్లాన్ ప్రకారమే అతడు కారులో పేలుడు పదార్థాలతో వచ్చి ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడా? అని ఆరా తీస్తున్నాయి.

News November 11, 2025

కోడిగుడ్డు పెంకుతో ఇన్ని లాభాలా!

image

కోడిగుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని పిల్లలకు ఉడికించిన గుడ్లు ఇస్తుంటారు. అయితే, కేవలం గుడ్డులోపల ఉన్న పదార్థం మాత్రమే కాదు.. బయట ఉండే పెంకుతోనూ చాలా లాభాలు ఉంటాయి.- కోడిగుడ్డు పెంకులను పడేయకుండా మొక్కల కుండీల్లో వేస్తే ఎరువుగా ఉపయోగపడతాయి. -గుడ్డు పెంకులను మెత్తగా చేసి తేనె కలిపి ముఖానికి రాస్తే చర్మం మెరుస్తుంది. – పెంకుల పొడిలో బేకింగ్ సోడా, కొబ్బరినూనె కలిపి అప్లై చేస్తే దంతాలు మెరుస్తాయి.

News November 11, 2025

ఏపీలో నేడు..

image

▶ గుంటూరులో జరుగుతున్న వాటర్ షెడ్ మహోత్సవ్‌లో పాల్గొననున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అనంతరం CM చంద్రబాబుతో భేటీ
▶ అమరావతిలో దసపల్లా 4 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ
▶ శ్రీకాకుళంలో ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న సిక్కోలు పుస్తక మహోత్సవం, 10 రోజులు కొనసాగింపు