News April 22, 2025

Inter Resluts: HYD విద్యార్థులకు ALERT

image

నేడు మ. 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తారు. మన హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్‌లో 90,351 విద్యార్థులకు 87,523 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 77,495 విద్యార్థులకు 75,083 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం నేడు తేలనుంది. రిజల్ట్ చూసుకునేందుకు నెట్ సెంటర్లకు వెళ్లే పని లేదు.. మొబైల్ ఉంటే చాలు. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి Way2Newsలో చెక్ చేసుకోండి.
SHARE IT

Similar News

News July 8, 2025

బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News July 8, 2025

కాంగ్రెస్ HYD, RR జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లు

image

TGలో కాంగ్రెస్ సంస్థాగత పునర్నిర్మాణం దిశగా కీలక అడుగు వేసింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. AICC TG ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదంతో జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. HYD జిల్లాకు జగ్గారెడ్డి, ఉమ్మడి RRకు శివసేనా రెడ్డిని నియమించారు. వీరి నియామకంతో అధికార పార్టీకి సిటీ, శివారులో పట్టు దొరుకుతుందని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News July 8, 2025

విఠలేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్సీ కవిత

image

పురాణాపూల్‌లోని విఠలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జరిగిన కళ్యాణోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయ నిర్వహణపై ఆలయ పూజారులతో ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.