News April 22, 2025

INTER RESULT: ఆసిఫాబాద్ జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 4,756 మంది విద్యార్థులు పరీక్షలు రాయంగా 3,354 మంది పాసయ్యారు. 70.52.% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్‌లో 4,920 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,948 మంది పాసయ్యారు. 80.24% ఉతీర్ణత సాధించారు.

Similar News

News April 23, 2025

పహల్గాం ఉగ్రదాడి అమానుషం: రాష్ట్రపతి

image

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ముర్ము ఖండించారు. ఆ ఘటన చాలా బాధ కలిగించిందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఉగ్రదాడి గురించి తెలిసి షాక్‌కు గురయ్యాను. ఇది పిరికిపంద చర్య. అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. అమాయక పౌరులపై దాడి చేయడం క్షమార్హం కాదు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం’ అని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఉగ్రదాడిని ఖండించారు.

News April 23, 2025

రేపు ఉదయం 10 గంటలకు..

image

AP: రాష్ట్రంలో రేపు ఉదయం 10 గంటలకు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షలతోపాటు ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ రిజల్ట్స్ కూడా విడుదల కానున్నాయి. ఈ ఏడాది టెన్త్ పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. మీకెంతో ఇష్టమైన Way2News యాప్ ద్వారా వేగంగా ఫలితాలు తెలుసుకోవచ్చు.
ALL THE BEST

News April 23, 2025

వికారాబాద్: సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. మంగళవారం సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉన్నతాధికారులతో కలిసి రెవెన్యూ గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, ఎల్ఆర్ఎస్ పథకాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

error: Content is protected !!