News April 22, 2025
INTER RESULTS.. ఖమ్మంలో బాలికలదే హవా.!

ఇంటర్ ఫలితాల్లో.. ఖమ్మం జిల్లాలో అమ్మాయిలు ప్రతిభ చాటారు. ఫస్టియర్‌లో 17,837 మందికి 12,476 మంది విద్యార్థులు హాజరు కాగా, జనరల్‌లో బాలురు 64.51, బాలికలు 77.89 శాతం, ఒకేషనల్‌లో బాలురు 43.95, బాలికలు 76.13 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 16,919 మందికి 12,996 మంది హాజరు కాగా, జనరల్‌లో బాలురు 72.10, బాలికలు 83.13 శాతం, ఒకేషనల్‌లో బాలురు 52.60, బాలికలు 86.90 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Similar News
News April 23, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} మధిరలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఓపెన్ 10వ తరగతి పరీక్షలు ∆} వైరా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
News April 23, 2025
ఖమ్మం: 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ (బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్షా ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షా టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.
News April 23, 2025
ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.