News April 22, 2025
Inter Results: సంగారెడ్డి జిల్లాలో ఇలా..!

ఇంటర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 15727 మంది పరీక్షలు రాయగా 10892 మంది ఉత్తీర్ణతతో 69.26 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 17918 మందికి 10787 మంది పాసయ్యారు. 60.20 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.
Similar News
News April 23, 2025
FY26లో 2-4% పెరగనున్న సిమెంట్ ధరలు!

దేశీయంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ డిమాండ్ 6.5-7.5% పెరగొచ్చని CRISIL అంచనా వేసింది. రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయనే అంచనాలతో గ్రామీణ ప్రాంతాల్లో గృహాల నిర్మాణం ఊపందుకుంటుందని తెలిపింది. అలాగే మౌలిక సదుపాయాల వ్యయం పెరగడంతో సిమెంట్ డిమాండ్ అధికమవుతుందని వెల్లడించింది. మొత్తం డిమాండ్‌లో 12 రాష్ట్రాల వాటా 63-65 శాతం ఉండొచ్చని వివరించింది. దీనివల్ల సిమెంట్ ధరలు 2-4% పెరగొచ్చని పేర్కొంది.
News April 23, 2025
వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

భూగర్భ వనరులను కాపాడుతూ.. నీటిని సంరక్షించేందుకు ప్రభుత్వం రూపొందించిన వాల్టా చట్టంని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. భూగర్భ జలాల పరిరక్షణపై భూగర్భ జలాల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, భూగర్భ జలాలను కాపాడుతూ వాటిని పెంపొందించాలన్నారు.
News April 23, 2025
నలుగురిపై కేసు.. ముగ్గురి అరెస్ట్: ADB SP

రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సయ్యద్ యాసిన్, జనాబ్, ముబారక్‌లపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రెండవ కేసులో హబీబ్, సర్దార్ (పరారీ) కేసు నమోదు చేశామన్నారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశామని.. ఒకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.