News April 22, 2025

Inter Results: మెదక్ జిల్లాలో ఇలా..!

image

ఇంటర్ ఫలితాల్లో మెదక్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 5572 మంది పరీక్షలు రాయగా 3428 మంది ఉత్తీర్ణతతో 61.52 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 6153 మందికి 3028 మంది పాసయ్యారు. 49.24 శాతం పాస్ పర్సంటేజీ సాధించారు.

Similar News

News October 28, 2025

అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది: అదనపు ఎస్పీ

image

విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని, వారి సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. రేగోడు పోలీసుల ఆధ్వర్యంలో పోచారం గ్రామానికి చెందిన అమరవీరుడు హెడ్ కానిస్టేబుల్ రాములు ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాములు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News October 27, 2025

పేదలకు సత్వర న్యాయం అందించాలి: కలెక్టర్ రాహుల్ రాజ్

image

పేద ప్రజలకు సత్వర న్యాయం అందించాలని, విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణ పాటించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఐదుగురు ఎంపీడీవోలతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. మండలాల అభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర కీలకమని, పారదర్శక పాలనే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.

News October 27, 2025

స్వగ్రామానికి చేరిన తల్లి, కూతురు మృతదేహాలు

image

కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన మంగ సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23) మృతదేహాలు స్వగ్రామం మెదక్ మండలం శివాయిపల్లికి చేరాయి. డీఎన్ఏ పరీక్షల అనంతరం నిన్న సాయంత్రం కుటుంబీకులకు అప్పగించారు. భర్త ఆనంద్‌ గౌడ్ మృతదేహాలను తీసుకొచ్చారు. మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.