News April 22, 2025
Inter Results: మేడ్చల్ జిల్లా విద్యార్థులకు ALERT

నేడు మ. 12 గంటలకు తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తారు. మన మేడ్చల్ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్‌లో 71,286 విద్యార్థులకు 69,842 మంది పరీక్ష రాశారు. సెకండియర్‌లో 63,946 విద్యార్థులకు 62,969 మంది హాజరయ్యారు. పరీక్ష రాసిన పిల్లల భవితవ్యం నేడు తేలనుంది. రిజల్ట్ చూసుకునేందుకు నెట్ సెంటర్లకు వెళ్లే పని లేదు.. మొబైల్ ఉంటే చాలు. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి Way2Newsలో చెక్ చేసుకోండి.
SHARE IT
Similar News
News January 29, 2026
ఒంటిమిట్ట: ఇవాళ ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి సన్నిధిలో ఇవాళ భీష్మ ఏకాదశి సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలవిరాట్‌కి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలకరించి, ఘనంగా గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు.
News January 29, 2026
పిల్లలకు SM బ్యాన్‌పై విధివిధానాలు రూపొందించండి: మంత్రి లోకేశ్

AP: మైనర్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచే విషయంపై విధివిధానాలను రూపొందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ‘సోషల్ మీడియా జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంపై మంత్రులతో జరిగిన మీటింగ్‌లో చర్చించాం. చిన్నారులకు SMను నిషేధించే అంశంపై సింగపూర్, AUS, మలేషియా, ఫ్రాన్స్‌లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని, ఫేక్ పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించా’ అని ట్వీట్ చేశారు.
News January 29, 2026
TU: బీఈడీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ మార్పు.!

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ (B.Ed) మూడవ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రీ పోన్ చేసినట్లు సీఓఈ (COE) ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. మొదటి ఫేజ్ పరీక్షలు ఈనెల 31 నుంచి ఫిబ్రవరి 4 వరకు, రెండో ఫేజ్ ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు జరగనున్నాయి. కళాశాలల ప్రిన్సిపాల్స్ సంబంధిత ప్రతులను ఈనెల 29లోగా సమర్పించాలని ఆయన ఆదేశించారు.


