News April 11, 2025
ఇంటర్ రిజల్ట్స్ అందరికంటే ముందుగా..

ఏపీలో ఇంటర్ ప్రశ్నాపత్రాల వ్యాల్యూయేషన్, డేటా కంప్యూటరైజేషన్ పూర్తయింది. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు రిలీజ్ కానున్నాయి. రిజల్ట్స్‌ను ఎప్పట్లాగే వే2న్యూస్‌లో అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. యాప్‌లో రిజల్ట్ స్క్రీన్‌పై హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. యాడ్స్, డేంజరస్ థర్డ్ పార్టీ లింక్స్ గొడవ లేకుండా క్షణాల్లో ఫలితం మీ స్క్రీన్‌పై. అంతే వేగంగా ఒకే క్లిక్‌తో రిజల్ట్ కార్డ్ షేర్ చేయొచ్చు.
Similar News
News March 14, 2026
చెరకు రసంతో కాంతివంతమైన చర్మం

చర్మకాంతిని పెంచడంలో చెరకురసం ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. * చెరకు రసంలో కొద్దిగా ముల్తానీ మట్టి కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టించి, పావుగంట తర్వాత కడిగేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. * చెరకు రసంలో కొద్దిగా తేనె కలిపి, ముఖానికి మసాజ్ చేసి, 10నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. * కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.
News March 14, 2026
తిరుమలలో నిత్యం కల్యాణమే..

తిరుమల శ్రీవారికి నిత్య కల్యాణం జరుగుతుంది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి అర్చకులు రోజూ అత్యంత వైభవంగా వివాహం జరుపుతారు. భక్తుల దాంపత్య సౌఖ్యం కోసం ఈ సేవ నిర్వహిస్తారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరుపుతారు. ఈ కళ్యాణమహోత్సవం చూడడానికి భక్తులకు కన్నుల పండువగా ఉంటుంది. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు స్వామివారి ఆశీస్సులతో పాటు వస్త్ర బహుమానం, ప్రసాదం లభిస్తాయి.
News March 14, 2026
పాలు పితికేటప్పుడు ఈ తప్పు చేయొద్దు

కొందరు పాడి రైతులు పశువు నుంచి పాలను సేకరించేటప్పుడు పొదుగు నుంచి పూర్తిగా పాలను తీయకుండా కొన్నింటిని వదిలేస్తారు. ఇలా పొదుగులో మిగిలిపోయిన పాలలోకి బాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధికి కారణమవుతుందని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అలాగే పొదుగుకు అయ్యే చిన్న గాయాలకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పొదుగులోకి వ్యాపించి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.


