News April 2, 2025
ఏప్రిల్ 12-15 మధ్య ఇంటర్ ఫలితాలు?

AP: రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 – 15వ తేదీల మధ్య విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాగా ఏప్రిల్ 6న ముగియనుంది. ఆ తర్వాత వాటిని కంప్యూటర్లో నమోదు చేయడానికి ఐదారు రోజులు పడుతుందని, ఆ తర్వాతే ఫలితాలు రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా.. 10 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు.
Similar News
News November 14, 2025
‘జూబ్లీ’ రిజల్ట్స్: రేవంత్ ప్రచారం పట్టం కట్టేనా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం CM రేవంత్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీనికి కారణం ఆయనే స్టార్ క్యాంపెయినర్ కావడం. 2014 నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని రోజుల తరబడి రేవంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు మంత్రులు కూడా తోడవటంతో ప్రచారం జోరందుకుంది. అలాగే గత ఎన్నికల్లో నవీన్ ఓటమి కూడా ఈసారి ఓటింగ్‌పై ప్రభావం చూపిందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
News November 14, 2025
చేతికి కంకణం ఎందుకు కట్టుకోవాలి..?

పూజ తర్వాత చేతికి కంకణం కట్టుకోవడం మన ఆచారం. పూజా ఫలం ఈ కంకణం ఉన్నన్ని రోజులు మనతోనే ఉండి, రక్షగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కంకణం మణికట్టుపై ఉన్న ముఖ్య నరాలపై ఒత్తిడి కలిగించి, జీవనాడి ప్రభావంతో హృదయ స్పందన రేటును సాధారణంగా ఉంచుతుందని నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని బంధించి, శరీరాన్ని సమతుల్యంగా ఉంచే ఒక పవిత్ర రక్షా కవచం లాంటిది. దీనిని మగవారు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి ధరించాలట.
News November 14, 2025
పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి సీఐఐ సదస్సు

AP: రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వైజాగ్‌లో CII భాగస్వామ్య సదస్సు ఇవాళ, రేపు జరగనుంది. దీని కోసం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ CM చంద్రబాబు పలు దేశాల్లో పర్యటించారు. ‘ఇన్వెస్ట్ ఇన్ AP’ సందేశంతో, ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియాస్ రోడ్ మ్యాప్ టు వికసిత్ భారత్-2047’ థీమ్‌తో ఈ సదస్సును నిర్వహిస్తోంది.


