News April 10, 2024
ఈనెల 12న ఇంటర్ ఫలితాలు!

AP: ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 12న విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నారట. ఫలితాలకు సంబంధించి అంతర్గత పనులు ఇవాళ మధ్యాహ్నం నాటికి పూర్తయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏవైనా టెక్నికల్ సమస్యలు తలెత్తితే ఫలితాల విడుదల ఒకట్రెండు రోజులు ఆలస్యం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Similar News
News January 18, 2026
వాహనంలో పశువుల తరలింపు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు(2/2)

ఎండ కాస్తున్న సమయంలో, బాగా చల్లని సమయాల్లో, భారీ వర్షంలో జీవాలను రవాణా చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రాత్రివేళలో మాత్రమే జీవాలను తరలించాలి. ఈ నిబంధన రోడ్డు మార్గంలో పశువుల తరలింపునకే వర్తిస్తుంది. పశువులను తీసుకెళ్లే వాహనం స్పీడ్ గంటకి 40 కిలోమీటర్లు మించకుండా చూసుకోవాలి. స్పీడ్ బ్రేకర్లు, మలుపుల వద్ద నెమ్మదిగా వెళ్లాలి.
News January 18, 2026
అల్కరాజ్ బోణీనా.. జకోవిచ్ 25వ ట్రోఫీనా!

టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఓ వైపు స్పానిష్ సంచలనం అల్కరాజ్ AUSలో బోణీ కొట్టాలని సిద్ధమయ్యారు. మరోవైపు తనకు కలిసొచ్చిన ఓపెన్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని జకోవిచ్ చూస్తున్నారు. అటు ఇటలీకి చెందిన వరల్డ్ నం.1 సిన్నర్ హ్యాట్రిక్ టైటిల్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఉమెన్స్‌లో స్టార్ ప్లేయర్స్ సబలెంకా, స్వియాటెక్ టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నారు.
News January 18, 2026
నర్సింగ్ పోస్టుల మెరిట్ లిస్ట్ రిలీజ్

TG: ప్రభుత్వాస్పత్రుల్లో నర్సింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి రెండో మెరిట్ లిస్టును మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. 2,322 పోస్టులకు గాను 1:1.5 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అభ్యర్థులు సాధించిన మార్కులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మెరిట్ లిస్ట్‌లో పేరున్న వారికి JAN 22 నుంచి FEB 7వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ వివరాలను అధికారిక <


