News April 19, 2025

ఏప్రిల్ 22న ఇంటర్ ఫలితాలు

image

TG: ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగాయి. Way2Newsలో వేగంగా, సులభంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఏపీ ఇంటర్ ఫలితాలు ఈనెల 12న విడుదలైన సంగతి తెలిసిందే.

Similar News

News April 20, 2025

ఎంఐఎం నేతలు విషసర్పాల కంటే ప్రమాదం: బండి

image

TG: వక్ఫ్ ఆస్తులను దోచుకున్న దొంగలంతా నిన్న హైదరాబాద్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎంఐఎం పార్టీ నేతలు విష సర్పాల కంటే ప్రమాదమని మండిపడ్డారు. ఒవైసీ మీటింగ్‌కు స్పాన్సర్ రేవంత్ ప్రభుత్వమేనని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్నాయన్నారు. వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

News April 20, 2025

IPL: టాస్ గెలిచిన RCB

image

ముల్లాన్‌పూర్‌లో PBKSvsRCB మ్యాచ్‌లో RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొన్న తమ సొంత గ్రౌండ్‌లో వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో RCB ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్ పోటాపోటీగా ఉండొచ్చు.

PBKS: ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్, అయ్యర్, ఇంగ్లిస్, వధేరా, శశాంక్, స్టొయినిస్, జాన్సెన్, బార్ట్లెట్, అర్షదీప్, చాహల్
RCB: సాల్ట్, కోహ్లీ, పటీదార్, రొమారియో, జితేశ్, డేవిడ్, క్రునాల్, భువీ, హేజిల్‌వుడ్, దయాళ్, సుయాశ్

News April 20, 2025

విమానాన్ని ఢీకొట్టిన టెంపో వ్యాన్!

image

బెంగళూరు ఎయిర్‌పోర్టులో నిలిచి ఉన్న ఇండిగో విమానాన్ని ఓ టెంపో వ్యాన్ ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం కింద వ్యాన్ ఇరుక్కున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఘటనపై ఇండిగో స్పందించింది. ‘బెంగళూరులో జరిగిన ఘటన మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు జరుగుతోంది. అది పూర్తైన అనంతరం తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొంది. టెంపో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!