News June 18, 2024
ఇంటర్ ఫలితాలు విడుదల.. WAY2NEWSలో వేగంగా..

AP ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. bie.ap.gov.in అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే ఫలితాలు వస్తాయి. ఒక్క క్లిక్‌తో వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను షేర్ చేసుకోవచ్చు.
Similar News
News March 17, 2026
క్లైమాక్స్‌ను సరికొత్తగా ప్లాన్ చేసిన హరీశ్ శంకర్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా క్లైమాక్స్ గురించి డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ‘‘సాధారణంగా ఏ సినిమాలోనైనా హీరో విలన్‌ని ఓడించి అంతం చేస్తాడు. ఈ సినిమాలో మాత్రం ఆ రెగ్యులర్ క్లైమాక్స్‌ను బ్రేక్ చేసి సరికొత్తగా ప్లాన్ చేశాం. సినిమా చివరి వరకు ‘తర్వాత ఏం జరుగుతుంది?’ అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు’’ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు.
News March 17, 2026
ఈనెల 27న భద్రాచలానికి సీఎం రేవంత్

భద్రాచలంలో ఈ నెల 27న జరిగే రాములోరి కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఉగాది రోజున బ్రహ్మోత్సవ సందడి ప్రారంభం కానుండగా.. అదేరోజు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ దంపతులను నవమి వేడుకలకు ఆహ్వానించనున్నారు. రూ.300 కోట్లతో ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయగా, తొలి విడతలో రూ.100 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల వెల్లడించారు.
News March 17, 2026
ఈ ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి: KTR

TG: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై KTR విమర్శలు గుప్పించారు. ‘ఎవరు, ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి? పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నవారా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న రైతులా? నెలకు రూ.2500 కోసం వేచి చూస్తున్న ఆడబిడ్డలా? బెనిఫిట్స్ అందని ఉద్యోగులు, పెన్షన్‌దారులు, పురుగుల అన్నం తింటున్న విద్యార్థులు ధన్యవాదాలు చెప్పాలా’ అని ధ్వజమెత్తారు.


