News April 22, 2025
ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదల

TG: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మ.12 గంటలకు Dy.CM భట్టి విక్రమార్క రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. 9.96 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. అందరికంటే వేగంగా Way2Newsలో ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే ఒకే క్లిక్‌తో రిజల్ట్స్ వస్తాయి. మార్కుల జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేసుకోవచ్చు.
Similar News
News April 22, 2025
హిందీ ఇంపోజిషన్: ఫడణవీస్ వ్యాఖ్యలపై స్టాలిన్ సెటైర్లు

హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ ఇంపోజిషన్‌పై తీవ్ర వ్యతిరేకతను చూసి మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ భయపడ్డారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఎద్దేవా చేశారు. అందుకే మహారాష్ట్రలో కేవలం మరాఠీ తప్పనిసరంటున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయనకు అధికారికంగా చెప్పిందా అని ప్రశ్నించారు. అదే నిజమైతే మూడో భాషా బోధన తప్పనిసరి కాదంటూ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.
News April 22, 2025
ఒక్కరోజే రూ.2,750 పెరిగిన తులం బంగారం

బంగారం ధరలు సరికొత్త మైలురాయి చేరాయి. హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24క్యారెట్ల పసిడి ₹1649 పెరిగి ₹1,00,000కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి కూడా 10గ్రాములకు ₹2,750 పెరిగి తొలిసారి ₹92,900కు చేరింది. అటు KG వెండి ₹1,11,000గా ఉంది. విజయవాడ, విశాఖ సహా రెండు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరల ధగధగకు ప్రధాన కారణాలు.
News April 22, 2025
అది చిన్ని బినామీ కంపెనీ: కేశినేని నాని

AP: విశాఖలో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 60 ఎకరాలు కేటాయించడాన్ని విజయవాడ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినాని నాని తప్పుబట్టారు. అది విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బినామీ కంపెనీ అని ఆరోపించారు. రూ.5,728 కోట్ల ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే అనుభవం, క్రెడిబిలిటీ ఆ సంస్థకు లేదన్నారు. వెంటనే భూ కేటాయింపులు రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబును కోరారు.