News April 15, 2025

ఈ నెల 21న ఇంటర్ ఫలితాలు విడుదల?

image

తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఈ నెల 21న విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికావొచ్చింది. వాల్యుయేషన్, మార్కుల డిజిటలైజేషన్ వారంలో పూర్తి చేసి, 21న ఫలితాలను ప్రకటిస్తారని సమాచారం. ఫలితాల కోసం 9.96 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. Way2News యాప్, బోర్డు అధికారక సైట్‌లో ఫలితాలు పొందవచ్చు.

Similar News

News November 29, 2025

పార్వతీపురం: గిరిజన పీజీఆర్‌ఎస్‌కి 26 వినతులు

image

గిరిజన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 26 వినతులు అందినట్లు జాయింట్ కలెక్టర్, ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడిఏ గిరిమిత్ర హాలులో గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీవో సమక్షంలో జరిగింది. గిరిజనుల వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సంబంధిత సమస్యలను నేరుగా సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో ఉంచి పరిష్కారం పొందేలా చూడాలన్నారు.

News November 29, 2025

TODAY HEADLINES

image

➢ గోవాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన(77 ఫీట్) రాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
➢ జనవరి 1న అందరం లొంగిపోతాం: మావోయిస్టు పార్టీ
➢ 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి: CM CBN
➢ అమరావతిలో 15 బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన
➢ దూసుకొస్తున్న ‘దిత్వా’ తుఫాన్.. కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన
➢ TGలో పంచాయతీ ఎన్నికలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
➢ కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీళ్లు రాలేదు: కవిత

News November 29, 2025

మావోయిస్ట్ కీలక నేత అనంత్ అస్త్ర సన్యాసం

image

మావోయిస్టు పార్టీ కీలక నేతల లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. తాజాగా మహారాష్ట్ర – మధ్యప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 15 మంది నక్సల్స్ అస్త్ర సన్యాసం తీసుకున్నారు. వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. జనవరి 1న సాయుధ విరమణ చేస్తున్నట్టు నిన్న లేఖ విడుదల చేసిన అనంత్ అంతలోనే లొంగిపోవడం గమనార్హం.