News April 11, 2024
రేపు ఉదయం ఇంటర్ ఫలితాలు

AP: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు ఉదయం విడుదల కానున్నాయి. ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ఏర్పాట్లు చేసింది. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగగా, మొత్తం 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 4వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. అందరికంటే ముందుగా WAY2NEWSలో ఇంటర్ ఫలితాలను చూసుకోండి.
Similar News
News March 12, 2026
ఇరాన్ యుద్ధం.. భారత్‌కు బిగ్ రిలీఫ్

క్రూడాయిల్ రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిలో భారత నౌకల రవాణాకు ఇరాన్ అనుమతి ఇచ్చినట్లు NDTV తెలిపింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీతో చర్చల తర్వాత ఈ నిర్ణయం వెలువడినట్లు పేర్కొంది. దీంతో పుష్పక్, పరిమల్ అనే ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ల ద్వారా గల్ఫ్ దేశాల ఆయిల్‌ను మనం సులభంగా దిగుమతి చేసుకోవచ్చు. అటు US, యూరప్, ఇజ్రాయెల్ దేశాల నౌకలపై ఆంక్షలు కొనసాగనున్నాయి.
News March 12, 2026
సాయుధ బలగాల్లో 93,139 ఉద్యోగాలు: నిత్యానంద రాయ్

సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF), అస్సాం రైఫిల్స్‌లో 93,139 ఖాళీలు ఉన్నాయని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంటులో వెల్లడించారు. CISF-28,342, CRPF-27,400, BSF-14,531, ITBP-12,333, SSB-6,784, అస్సాం రైఫిల్స్-3,749 ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. UPSC, SSC ద్వారా ఏటా పోస్టుల భర్తీ కొనసాగుతోందని చెప్పారు.
News March 12, 2026
మళ్లీ 100 డాలర్లకు ఆయిల్ ధర

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $100 దాటింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత $120 చేరువైన రేట్లు.. ఉద్రిక్తతలు ముగింపునకు వచ్చిందన్న ట్రంప్ ప్రకటనతో ఇటీవల $89కు దిగొచ్చాయి. కానీ తాజాగా హార్ముజ్‌లో చమురు నౌకలపై ఇరాన్ దాడి, ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ నిల్వ కేంద్రాలపై దాడితో ఆయిల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.


