News April 22, 2025

INTER RESULTS.. హనుమకొండలో ఎంత మంది పాస్ అయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో హనుమకొండ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్‌లో 18,479 మంది పరీక్షలు రాయగా 13,601 మంది ఉత్తీర్ణత సాధించారు. 73.60 పాస్ పర్సంటేజీ వచ్చింది. ఫస్ట్ ఇయర్‌లో 19,543 మంది విద్యార్థులకు 13,601 మంది ఉత్తీర్ణులు కాగా.. 69.60 పాస్ పర్సంటేజీ నమోదైంది.

Similar News

News April 23, 2025

IPL: లక్నోపై ఢిల్లీ ఘన విజయం

image

LSGతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్ల తేడాతో 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ఛేజింగ్‌లో రాహుల్(57*), పోరెల్(51) అర్ధ శతకాలతో రాణించారు. ఓ మోస్తరు లక్ష్యం కావడంతో ఢిల్లీ బ్యాటర్లు ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. మార్క్రమ్ 2 వికెట్లు తీశారు. ఇవాళ విజయం సాధించినా రన్‌రేట్ పరంగా PTలో DC 2వ స్థానంలో కొనసాగుతోంది. GT అగ్రస్థానంలో ఉంది.

News April 23, 2025

OU: బీ ఫార్మసీ పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఫార్మసీ కోర్సు పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీ ఫార్మసీ(పీసీఐ) సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు. -SHARE IT..

News April 22, 2025

ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ ఆఫీసర్ మృతి

image

J&k పహల్గామ్‌లో ఇవాళ జరిగిన ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మనీశ్ రంజన్ మృతి చెందారు. ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. కుటుంబసభ్యులతో కలిసి పహల్గామ్ పర్యటనకు వెళ్లగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. భార్య, పిల్లలను తనకు ఎదురుగా పరిగెత్తమని చెప్పారు. ఇంతలోనే బుల్లెట్లు తగిలి మనీశ్ ప్రాణాలు వదిలాడు. భార్యాపిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.

error: Content is protected !!