News June 18, 2024

నేడు ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు

image

AP: నేడు ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు అధికారులు రిజల్ట్స్ వెల్లడించనున్నారు. దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరోవైపు ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు సమాచారం.

Similar News

News March 12, 2026

పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లు.. ఉత్తర్వులు జారీ

image

AP: సర్పంచ్‌ల పదవీ కాలం APR 2తో ముగియనుంది. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. MRO, MPDO, MEO, డిప్యూటీ MPDO, వీరి కంటే ఎక్కువ హోదా కలిగిన వారిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాలని సూచించింది. కొత్త సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టేవరకు వీరు పాలన కొనసాగించాలంది. రాష్ట్రంలో 13,100 గ్రామ పంచాయతీలు ఉన్న విషయం తెలిసిందే.

News March 12, 2026

కొవిడ్ టీకాతో మరణాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

కొవిడ్ టీకా తర్వాత కొన్ని మరణాలు, తీవ్రమైన అనారోగ్యం సంభవించినట్లు GOVT డేటాలో వెల్లడైందని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాంటప్పుడు బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్పష్టం చేసింది. వారి కోసం నో ఫాల్ట్ కాంపెన్సేషన్ పాలసీ(నష్టం/ప్రమాదం ఎవరి వల్ల జరిగిందో నిరూపించాల్సిన అవసరం లేకుండా పరిహారం ఇవ్వడం)ని రూపొందించాలని ఆదేశించింది. రచన గంగు వేసిన కేసులో ఈ మేరకు తీర్పునిచ్చింది.

News March 12, 2026

GOOD NEWS: వారికి 15 రోజుల సెలవులు

image

AP: GOVT ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రిటైర్మెంట్‌కు రెండేళ్ల ముందు దాదాపు 50వేల మందికి 15 రోజులు వెల్‌నెస్ లీవ్ ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే రూ.50వేల వరకు హెల్త్ బెనిఫిట్స్ అందజేస్తామని తెలిపారు. సెలవుల్లో టెస్టులు చేయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు.