News December 31, 2024
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య!

TG: ఖమ్మం(D) మధిర మండలంలోని కిష్టాపురం ఎస్సీ గురుకుల కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి వర్ధన్ నిన్న రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తోటి స్నేహితులు తెలిపారు. అతడి స్వస్థలం ముదిగొండ. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2026
T20WC నుంచి ఒమన్ ఔట్

ఇవాళ ఐర్లాండ్ చేతిలో ఓటమితో T20WC-2026 నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా ఒమన్ నిలిచింది. గ్రూప్-Bలో ఉన్న ఆ జట్టు లీగ్ దశలో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదే గ్రూపులో శ్రీలంక, జింబాబ్వే ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాలతో 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నాయి. అటు లీగ్ దశలో ఒమన్ తన చివరి మ్యాచ్‌ను FEB 20న ఆస్ట్రేలియాతో ఆడనుంది.
News February 14, 2026
AP వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం: అచ్చెన్న

భారత వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతంగా ఉందని, వ్యవసాయ రంగంలో AP 7.83% వృద్ధి రేటు సాధించిందని మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ సందర్భంగా వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు జరిపి రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అన్నదాత సుఖీభవ-PM కిసాన్ కింద 2025-26లో రూ.6,309 కోట్లు చెల్లించామని.. 2026-27లో దానిని రూ.6,600 కోట్లకు పెంచామన్నారు.
News February 14, 2026
బంగినపల్లి మామిడి@ టన్ను రూ.1.75 లక్షలు

AP: మామిడి పండ్లకు రికార్డు స్థాయి ధరలు పలుకుతున్నాయి. తోతాపురి టన్ను ధర ₹1.10 లక్షలకు చేరగా, బంగినపల్లి మామిడి(కవర్లు కట్టి సాగు చేసినవి)కి ₹1.75 లక్షల రేటు పలికింది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని రైతులకు కాసుల వర్షం కురుస్తోంది. గతంతో పోలిస్తే ఈ రేటు ₹50వేలు ఎక్కువ కావడం విశేషం. కాయల నాణ్యత తగ్గకుండా ఉండేందుకు వాటికి కవర్లను(ఒక్కో కవర్ ₹2) కడుతుంటారు. వీటికి ప్రభుత్వం 50% సబ్సిడీ కూడా ఇస్తుంది.


