News January 23, 2025
నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

AP: అనంతపురం సమీపంలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి చరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న అతడు క్లాస్ జరుగుతుండగానే బయటికి వచ్చి మూడో అంతస్తు నుంచి దూకేశాడు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. చరణ్ స్వస్థలం రామాపురంగా గుర్తించారు. ఇటీవల సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చి వెళ్లిన చరణ్ ఇంతలోనే సూసైడ్ చేసుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
Similar News
News January 17, 2026
3 రోజుల్లోనే రూ.61.1 కోట్లు

నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే రూ.61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 14 విడుదలైన ఈ మూవీ తొలి రోజు రూ.22 కోట్లు, రెండు రోజుల్లో రూ.41.2కోట్లు సాధించింది. మారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించారు.
News January 17, 2026
నగలు సర్దేయండిలా..

మహిళలకు అలంకారం, ఆభరణాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి లేటెస్ట్గా ఏ నగ వచ్చినా సరే కొనేయాల్సిందే. అయితే వాటిని సరిగ్గా భద్రపరచకపోతే అవి కొన్నాళ్లకు రంగుమారి పాడైపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే..ఆభరణాలు భద్రపరిచే ముందు శుభ్రంగా తుడిచి ఆరబెట్టిన తర్వాతే బాక్సుల్లో సర్దాలి. అన్ని రకాల నగలను ఒకే బాక్సులో పెట్టకూడదు. విడివిడిగా ఎయిర్టైట్ బాక్సులు, జిప్ లాక్ బ్యాగులు వాడాలి.
News January 17, 2026
నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబోరేటరీ(<


