News June 26, 2024
కాసేపట్లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు.. WAY2NEWSలో వేగంగా..

AP: ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు కాసేపట్లో వెల్లడి కానున్నాయి. ఈ పరీక్షలకు 3.40 లక్షల మంది హాజరయ్యారు. WAY2NEWS యాప్‌లో వేగంగా, సులభంగా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఫలితాలను ఇతరులకూ ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
Similar News
News January 7, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీఎం సోదరుడికి సిట్ పిలుపు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులిచ్చింది. గతంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రేపు ఉదయం సిట్ ఎదుట హాజరుకావాలని సూచించారు.
News January 7, 2026
మొలతాడు కట్టుకోవడం వెనుక సైన్స్ ఇదే..

మొలతాడు కట్టుకోవడం వెనుక శాస్త్రీయ, ఆరోగ్య కారణాలున్నాయి. ఇది శరీరంలోని అవయవాల పెరుగుదలను క్రమబద్ధంగా ఉంచుతుంది. హెర్నియా వంటి సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. నడుం చుట్టూ ఉండే నరాలపై ఒత్తిడి కలిగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని శక్తిని వృథా కాకుండా కాపాడుతుందని నమ్ముతారు. నలుపు, ఎరుపు రంగు దారాలు దిష్టి తగలకుండా రక్షణ కవచంలానూ పనిచేస్తాయి. వెండి మొలతాడు ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్మకం.
News January 7, 2026
ICC స్పందించిందన్న BCB.. భారత్‌లోనే బంగ్లా మ్యాచ్‌లు!

T20 వరల్డ్ కప్‌లో తమ ప్లేయర్ల భద్రత విషయంలో లేవనెత్తిన ఆందోళనలపై ICC స్పందించినట్లు బంగ్లా బోర్డు వెల్లడించింది. టోర్నీలో బంగ్లా టీమ్ పూర్తిస్థాయిలో పాల్గొనేలా చూసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ICC చెప్పినట్లు తెలిపింది. ఆటగాళ్ల భద్రత విషయంలో BCB ఇన్పుట్స్ తీసుకొని తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో బంగ్లా మ్యాచ్‌లు భారత్‌లోనే కొనసాగనున్నట్లు స్పష్టమవుతోంది.


