News August 3, 2024
మహిళలకు వడ్డీలేని రుణాలు: భట్టి

TG: రాష్ట్రంలోని మహిళలకు రూ.20వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురంలో ఆయన పర్యటించారు. మధిర నియోజకవర్గంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. అంగన్వాడీలో 3వ తరగతి వరకు ఏర్పాటు చేసి 4వ తరగతికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు విద్యార్థులను పంపించేలా చేస్తామన్నారు.
Similar News
News January 22, 2026
వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్!

బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు ఉండనున్నాయి. జనవరి 24 (నాలుగో శనివారం), 25 (ఆదివారం), 26 (గణతంత్ర దినోత్సవం) సెలవులు కాగా 27(మంగళవారం)న సమ్మె జరగనుంది. వారానికి ఐదు పని దినాలు ఉండాలని డిమాండ్ చేస్తూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. అయితే ఈ రోజుల్లో డిజిటల్, ఏటీఎం సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదు. ఏమైనా బ్యాంక్ పనులుంటే ఇవాళ, రేపు ప్లాన్ చేసుకోవడం మేలు.
News January 22, 2026
సన్‌స్క్రీన్ ఎలా వాడాలంటే?

కాలంతో సంబంధం లేకుండా సన్‌స్క్రీన్ రోజూ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ముఖం, మెడకు రాయాలి. బయటికి వెళ్లేందుకు 15నిమిషాల ముందు రాసుకోవాలి. తేమ ఎక్కువగా ఉన్నా, చెమట పట్టినప్పుడు, స్విమ్మింగ్ తర్వాత సన్‌స్క్రీన్ మళ్లీ రాసుకోవాలి. సున్నితమైన చర్మం ఉన్నవారు జింక్ ఆక్సైడ్ లేదా టైటానియం డయాక్సైడ్ ఉండే మినరల్-బేస్డ్ సన్స్క్రీన్లను వాడడం మంచిదని సూచిస్తున్నారు.
News January 22, 2026
రేపు వసంత పంచమి.. చిన్నారులతో ఇలా చేయిస్తున్నారా?

వసంత పంచమి నాడు పిల్లలకు తెలుపు/పసుపు దుస్తులు ధరింపజేసి ఓంకారంతో అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతీ దేవి కటాక్షంతో విద్యాబుద్ధులు సమకూరుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘వారితో పలక, బలపం, పుస్తకాలకు పూజ చేయించాలి. తద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ‘‘సరస్వతీ నమస్తుభ్యం’’ పఠిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది’ అని చెబుతున్నారు. వసంత పంచమి పూజ, అక్షరాభ్యాస ముహూర్తం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


